రాజీనామా చెయ్, సిద్ధిపేటలో ఎలా గెలుస్తావో చూస్తా..! హరీశ్ రావుకి సీఎం రేవంత్ సవాల్

ప్రజలు అండగా నిలిస్తే బీఆర్ఎస్ ని బద్దలుకొడతా, బీజేపీని బొంద పెడతా.

Cm Revanth Reddy : 3వ విడత 2 లక్షల రూపాయల రుణమాఫీ వైరా వేదిక మీద చేయడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం గడ్డ.. కాంగ్రెస్ అడ్డా అని చెప్పారాయన. కాంగ్రెస్ పార్టీ.. 140 కోట్ల మంది ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చేలా చేసిందన్నారు రేవంత్. రైతు సంఘర్షణ సమితి రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని 8 నెలలు తిరగక ముందే నెరవేర్చామన్నారు. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా, సిద్ధిపేటకి మళ్ళీ పోటీ చేయనని హరీశ్ రావు అన్నారని.. సిగ్గుశరం ఉంటే హరీశ్ రావు రాజీనామా చేయాలని ఖమ్మం గడ్డ నుండి సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి.

”రాజీనామా చేయకపోతే కాంగ్రెస్ పై విమర్శలు చేయనని అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయి హరీశ్. రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర మీది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో దళితులు, గిరిజనులను మోసం చేశారు. ప్రతి నియోజకవర్గంలో మేము ఇందిరమ్మ ఇళ్లు 3,500 ఇస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో 20 సీట్లు ఇచ్చిన ప్రజలు.. పార్లమెంటులో గుండు సున్నా ఇచ్చారు. బంజారాహిల్స్ బస్టాండ్ లో అడుక్కునే పరిస్థితికి వచ్చారు.

పంద్రాగస్టు 2026లో సీతారామ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం. ఎన్ని వేల కోట్లు అయినా నిధులు వరదలా పారిస్తా. మున్నేరు నది నుండి మీకు నీళ్ళు తీసుకొస్తాం. డోర్నకల్ నియోజకవర్గంలో కురవి వీరభద్రుడు సాక్షిగా 15 టీఎంసీల రిజర్వాయర్ ను నిర్మించటానికి అవసరమైన ప్రణాళిక చేస్తాం.
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చా. రాజీవ్ ఆరోగ్య శ్రీకి నిధులు పెంచా. 90 వేల ఉద్యోగులు ఇచ్చా. గ్రూప్ 1, 2 ఇస్తాం.

బీఆర్ఎస్ కి ఖమ్మం జిల్లాలో గాడిద గుడ్డు ఇచ్చారు. ప్రజలు అండగా నిలిస్తే బీఆర్ఎస్ ని బద్దలుకొడతా, బీజేపీని బొంద పెడతా. భట్టి సవాల్ తో ఏకీభవిస్తున్నా. మా పార్టీ నుండి సంక్షేమంపై భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చకు వస్తారు. బావ, బామ్మర్దులు బిల్లా రంగా వస్తారా? ఎక్కడికైనా సిద్ధమే. హరీశ్.. సవాల్ విసిరావుగా.. రాజీనామా చేయ్. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా. అధికారంలో ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు తెలుస్తుంది బాధ” అంటూ విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : ఆపరేషన్‌ బాలి..! కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు విరుగుడుగా బీఆర్‌ఎస్‌ స్పెషల్‌ ఆపరేషన్‌..!

ట్రెండింగ్ వార్తలు