Independence day 2024 : దేశాలు వేరైనా మనమంతా ఒక్కటే.. జెండా పండుగ రోజున ‘జయహో’ అంటున్న భారత్, పాకిస్థానీలు

Independence day 2024 : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులు, పాకిస్థానీలను ఒక మ్యూజిషియన్ ఏకం చేశాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Independence Day 2024_ Viral Video Shows Indians, Pakistanis Singing AR Rahman's 'Jai Ho' In UK ( Image Source : Google )

Independence day 2024 : ఆగస్టు 15, 78వ స్వాతంత్ర్య దినోత్సవం.. జెండా పండుగ రోజున లండన్ వీధుల్లో దేశభక్తి ఉప్పొగింది. పొరుగు దేశాల్లో ఉన్నా దేశభక్తితో అందరూ ఒక్కటే అనే నినాదాన్ని వినిపించారు భారతీయులు, పాకిస్థానీలు. యూకేలోని లండన్ వీధుల్లో ఐక్యతగా కనిపించి అరుదైన ప్రదర్శనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

Read Also : Viral Video : కదిలే ట్రక్కు వెనుక స్కేటింగ్ చేస్తూ యువకుల డేంజరస్ స్టంట్స్.. వీడియో వైరల్..!

తమ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకోవడానికి భారతీయులు, పాకిస్తానీలు ఒకటిగా కలిసి వచ్చారు. ఇరుదేశాలకు చెందిన వేలాది మంది బ్రిటన్‌లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులు, పాకిస్థానీలను ఒక మ్యూజిషియన్ ఏకం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆంగ్లేయుల బానిసత్వం తెంచుకుని స్వాతంత్ర్యం తెచ్చుకున్న తర్వాత భారత్, పాకిస్థాన్ ఇరు దేశాలు రెండుగా చీలిపోయాయి. అయితే, అప్పటినుంచి తమ స్వాతంత్ర్య దినోత్సవాలను కేవలం ఒక రోజు తేడాతో జరుపుకుంటాయి. పాకిస్థాన్ ఆగష్టు 14న, భారత్ ఆగస్టు 15న జరుపుకుంటాయి.

ఈ సంవత్సరం లండన్ వీధుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రెండు దేశాల ప్రజలు కలిసి “జయహో” వంటి పాటలు పాడుతూ జరుపుకున్నారు. ఆస్కార్ విన్నింగ్ చిత్రం స్లమ్‌డాగ్ మిలియనీర్ ఏఆర్ రెహమాన్ వెర్షన్ “వందేమాతరం” పాటతో లండన్ వీధుల్లో దేశభక్తిని చాటుకున్నారు.

ఈ వీడియోలో ఇరు దేశాల ప్రజలు తెల్లని దుస్తులు ధరించి లండన్ వీధిలో కలిసి పాడుతూ భారత్, పాకిస్తాన్ జెండాలను ఊపుతూ కనిపించారు. జయహో.. పాటను పాడుతూ జెండాలను ఊపుతూ కనిపించారు. మ్యూజిషియన్ @vish.music తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేశాడు. మరోవైపు.. మైనారిటీలు, వలసదారులను లక్ష్యంగా చేసుకుని యూకేలో హింసాత్మక అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

Read Also : Viral Video : స్కూల్ రోజులు గుర్తుకొస్తున్నాయి.. ప్రిన్సిపాల్‌ చేత బెత్తంతో కొట్టించుకున్న పూర్వ విద్యార్థులు..!

ట్రెండింగ్ వార్తలు