Viral Video : స్కూల్ రోజులు గుర్తుకొస్తున్నాయి.. ప్రిన్సిపాల్‌ చేత బెత్తంతో కొట్టించుకున్న పూర్వ విద్యార్థులు..!

Viral Video : ఈ పూర్వ విద్యార్థుల్లో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, పోలీసు అధికారులే ఉన్నారు. వారంతా తెల్లటి చొక్కాలు, ప్యాంటు ధరించి వారి ప్రిన్సిపాల్ ముందు ఒక్కొక్కరుగా కనిపించారు.

Viral Video : స్కూల్ రోజులు గుర్తుకొస్తున్నాయి.. ప్రిన్సిపాల్‌ చేత బెత్తంతో కొట్టించుకున్న పూర్వ విద్యార్థులు..!

Video_ Former Students Get Beaten With Cane By Principal To Relive Memories ( Screenshot Grab from Video )

Viral Video : అప్పుడు విద్యార్థులు.. ఇప్పుడు వారంతా అధికారులు.. స్కూల్ నాటి రోజుల్లో ప్రిన్సిపాల్ చేత ఎన్నోసార్లు దెబ్బలు తిన్నారు. ఇప్పుడు ఆ జ్ఞాపకాలను మళ్లీ నెమరువేసుకున్నారు పూర్వ విద్యార్థులు. అధికారులు అయినప్పటికీ స్కూల్ పిల్లల్లా మారిపోయారు. ప్రిన్సిపాల్‌ను అడిగి మరి బెత్తంతో కొట్టించుకున్నారు. ఇలా అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఇటీవల ఒక పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థుల బృందం ఒక చోట కలుసుకుంది. అయితే, ఈ రీయూనియన్ అనేది అసాధారణ రీతిలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

Read Also : Mahesh Babu : కాలినడకన తిరుమలకు చేరుకున్న సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు ఫ్యామిలీ..

అందుకోసం ఆ స్కూల్ మాజీ ప్రిన్సిపాల్ చేత బెత్తంతో కొట్టించుకున్నారు. ఇదంతా ఒక డాక్యుమెంట్ మాదిరిగా చేస్తూ ఒక షార్ట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బెత్తంతో కొట్టే వ్యక్తి.. పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయుడు.. పూర్వ విద్యార్థులను బెత్తంతో కొట్టడం కనిపిస్తుంది. ఈ పూర్వ విద్యార్థుల్లో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, పోలీసు అధికారులే ఉన్నారు. వారంతా తెల్లటి చొక్కాలు, ప్యాంటు ధరించి వారి ప్రిన్సిపాల్ ముందు ఒక్కొక్కరుగా కనిపించారు. ప్రిన్సిపాల్ ఆ తర్వాత వారిని స్కూల్ రోజుల్లో బెత్తంతో ఎలా కొట్టారో అలానే కొడుతూ ఆనాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేశారు.

“ఇదిగో ఒక స్కూల్ పాత విద్యార్థుల విచిత్ర కలయిక.. అక్కడ కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, పాఠశాలల యజమానులు ఉన్నారు. వారందరికీ ఒక కోరిక ఉంది. ప్రిన్సిపాల్ వారిని బెత్తంతో కొట్టాలి. వారి పాఠశాల జీవితాన్ని గుర్తుచేసుకోవడానికి ఆయన బెత్తం ఉపయోగపడింది.

ఎందుకంటే.. వారు ప్రిన్సిపాల్ అప్పట్లో చెరుకు బెత్తంతో కొట్టడం ఫలితంగా తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని వారు నమ్ముతున్నారు. అదే తమకు ఆశీర్వాదంగా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వీడియో కింద వివరణ ఇచ్చారు. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి 3లక్షల 66వేల కన్నా ఎక్కువ వ్యూస్ పొందింది. 4వేల కన్నా ఎక్కువ లైక్‌లను పొందింది. వందలాది కామెంట్లు వచ్చాయి.

ఈ వీడియోను వీక్షించిన నెటిజన్ ఒకరు.. “ఇది చాలా బాగుంది. మళ్లీ స్కూల్ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి” అని కామెంట్ చేశాడు. ప్రిన్సిపాల్ క్రమశిక్షణా పద్ధతులు ఇప్పటికీ వీరిలో బలమైన ముద్రను మిగిల్చాయి. ఆ అనుభవాలకు తమ విజయాన్ని ఆపాదించారు” అని మరో యూజర్ కామెంట్ చేశాడు. “మాజీ ప్రిన్సిపల్ సైతం ఈ మధురమైన క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు కనిపించారు. బహుశా ఆయన పట్ల పూర్వ విద్యార్థులకు ఉన్న గౌరవభవాన్ని చూపించి ఉండవచ్చు. ప్రతి ఒక్కరూ మంచి ఉత్సాహంతో హాస్యాన్ని పండించారు.. అలాగే ఉండండి” అని మరొకరు కామెంట్ చేశారు.

“ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది.. నాకు 8 ఏళ్ల వయస్సులో మెటల్ స్కేల్‌తో పిడికిలిపై కొట్టడం నాకు గుర్తుంది. ఇది బాధాకరంగా ఉంది. ఒక ఉపాధ్యాయుడు నా 4 ఏళ్ల వయస్సులో డస్టర్‌ను విసిరినప్పుడు నేను స్కూల్‌కి వెళ్లి తాండవం చేశాను. ఇప్పుడు టీచర్లు ఎవరూ పిల్లలను కొట్టే పరిస్థితి లేదు. అలా చేస్తే.. ఆ టీచర్లు వెంటనే సస్పెండ్ అవుతారు అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.

Read Also : Massive Power Outage : పాము చేసిన పనికి భారీ విద్యుత్తు అంతరాయం.. అమెరికాలో 11వేల మంది అంధకారంలోకి..!