Massive Power Outage : పాము చేసిన పనికి భారీ విద్యుత్తు అంతరాయం.. అమెరికాలో 11వేల మంది అంధకారంలోకి..!
Massive Power Outage : పాము కారణంగా భారీ విద్యుత్ అంతరాయం కలిగి 11 వేల మందిని అంధకారంలోకి నెట్టివేసింది. దాదాపుగా గంటన్నరపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Snake Sparks Massive Power Outage In US, Over 11,000 Residents ( Image Source : Google )
Massive Power Outage : ఒక పాము కారణంగా భారీ విద్యుత్తు అంతరాయం కలిగింది. దాదాపు గంటన్నర పాటు విద్యుత్ నిలిచిపోయింది. దాంతో అమెరికాలోని వర్జీనియాలో 11వేల మంది నివాసితులను అంధకారంలోకి నెట్టేసింది. విద్యుత్తు అంతరాయంతో కిల్న్ క్రీక్, సెంట్రల్ న్యూపోర్ట్ న్యూస్, క్రిస్టోఫర్ న్యూపోర్ట్ యూనివర్శిటీలోని కొన్ని ప్రాంతాలు సహా శనివారం రాత్రి దాదాపు 11,700 మంది నివాసితులకు విద్యుత్ లేకుండా పోయింది. అధిక ఓల్టేజీ ప్రాంతంలోకి ప్రవేశించిన పాము ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో ఒక్కసారిగా అంతరాయం ఏర్పడిందని డొమినియన్ ఎనర్జీ అధికారులు నివేదించారు.
అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడంతో గంటన్నర వ్యవధిలోనే విద్యుత్‌ను పునరుద్ధరించారు. విద్యుత్ అంతరాయానికి కారణమైన పాము నిర్దిష్ట జాతికి గుర్తించలేదు. కానీ, పాము కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని అక్కడి విద్యుత్ అధికారులు తెలిపారు.
పాము అధిక ఓల్టేజీ ప్రాంతంలోకి ప్రవేశించి ఆపై ట్రాన్స్‌ఫార్మర్‌కు తాకడంతోనే విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రాత్రి 9:15 గంటల ప్రాంతంలో కేవలం 6వేలకు పైగా ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడింది. న్యూస్ రిపోర్టుల ప్రకారం.. డొమినియన్ ఎనర్జీ సిబ్బంది వినియోగదారులందరికీ దాదాపు రాత్రి 10:30 గంటలలోపు విద్యుత్ సేవలను పునరుద్ధరించారు. మొదటి విద్యుత్ అంతరాయాలను నివేదించిన దాదాపు గంటన్నర తర్వాత సమస్యను పరిష్కరించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యుత్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. విద్యుత్ అంతరాయానికి కారణమైన పాము జాతిని గుర్తించలేదన్నారు. తూర్పు గార్టెర్ పాములు, తూర్పు ఎలుక పాములు రెండూ వర్జీనియాకు చెందినవి ఉంటాయన్నారు. పీపుల్ మ్యాగజైన్ ప్రకారం.. గత మేలో, నాష్విల్లే సమీపంలో పాము కారణంగా నాలుగు విద్యుత్తు అంతరాయాలు ఏర్పడ్డాయి. నెల మొత్తం, అనేక పాములు ఫ్రాంక్లిన్, టెన్లోని హెన్‌పెక్ సబ్‌స్టేషన్‌లోకి ప్రవేశించాయి. టేనస్సీలో, పాములను ఎక్కువగా బూడిద ఎలుక పాములుగా గుర్తించారు.