Google Pixel 9 Series : అత్యాధునిక ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్.. భారత్‌లో కొత్త వాక్-ఇన్ రిటైల్ స్టోర్లు, సర్వీసు సెంటర్లు ఓపెనింగ్..!

Google Pixel 9 Series : ఈ సర్వీసు సెంటర్లు అదే రోజు రిప్లేస్‌మెంట్ కూడా అందిస్తాయి. కొత్త పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు, వేరబుల్ దేశంలోని థర్డ్-పార్టీ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంటాయి.

Google Pixel 9 Series to Be Available via Walk-in Retail and Service Centres in India ( Image Source : Google )

Google Pixel 9 Series : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత సరికొత్త పిక్సెల్ ఫోన్లను ప్రకటించింది. పిక్సెల్ 9 సిరీస్‌తో పాటు పిక్సెల్ వాచ్ 3, పిక్సెల్ బడ్స్ ప్రో 2 వైర్‌లెస్ హెడ్‌సెట్‌ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఫోన్లు భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. కస్టమర్‌లు దేశంలో ఏర్పాటు చేసిన కొత్త రిటైల్ స్టోర్‌ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని గూగుల్ ప్రకటించింది.

Read Also : Jawa 42 Bike Launch : కొత్త జావా 42 అడ్వెంచర్ బైక్ భలే ఉందిగా.. మొత్తం 6 కలర్ ఆప్షన్లలో.. ధర ఎంతంటే?

కంపెనీ ప్రకారం.. ఈ సర్వీసు సెంటర్లు అదే రోజు రిప్లేస్‌మెంట్ కూడా అందిస్తాయి. కొత్త పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు, వేరబుల్ దేశంలోని థర్డ్-పార్టీ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంటాయి. కొత్త పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు, వేరబుల్ డివైజ్‌లను ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లతో పాటు ఫస్ట్ పిక్సెల్ 8 హ్యాండ్‌సెట్‌లను ఉత్పత్తి చేయడం ప్రారంభించినట్లు సెర్చ్ దిగ్గజం ప్రకటించింది. మిడ్‌రేంజ్ పిక్సెల్ 8ఎ మోడల్‌ను భారత్‌లో కూడా తయారీ ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది.

భారత్‌లో కొత్త వాక్-ఇన్ రిటైల్, సర్వీసు సెంటర్లు ఓపెనింగ్ :
కొత్తగా ప్రకటించిన గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9ప్రో, పిక్సెల్ 9ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌లు బెంగళూరు, ఢిల్లీలో రెండు కొత్త వాక్-ఇన్ సెంటర్‌ల ద్వారా కొనుగోలు అందుబాటులో ఉంటాయి. ముంబైలో మూడో స్టోర్‌ను కూడా ప్రారంభించనున్నట్లు గూగుల్ తెలిపింది.

కంపెనీ లేటెస్ట్ ఫోన్లను విక్రయించడంతో పాటు గూగుల్ ఈ సెంటర్లలో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ హెడ్‌సెట్‌లు, అలాగే ఫిట్‌బిట్, నెస్ట్ ఫోన్లలో రిపేరింగ్, రిప్లేస్‌మెంట్స్, సపోర్టును కూడా అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్, సర్వీసెస్ కొన్ని ప్రొడక్టులపై అదే రోజు రిప్లేస్‌మెంట్ అందించడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ తెలిపింది.

పిక్సెల్ 9 సిరీస్, పిక్సెల్ వాచ్ 3, పిక్సెల్ బడ్స్ ప్రో 2 సేల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్, నెస్ట్ డివైజ్‌లను ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తోంది. అయితే, పిక్సెల్ 9 సిరీస్, పిక్సెల్ వాచ్ 3, పిక్సెల్ బడ్స్ ప్రో 2 రాకతో మరిన్ని ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్లు దేశంలోని 15 నగరాల్లోని 150కి పైగా క్రోమా, రిలయన్స్ డిజిటల్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా అందుబాటులో ఉంటాయి. కంపెనీ గత ఫోన్ల మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

భారత్‌‌లో విక్రయించే మొదటి ఫోన్లలో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, ఈ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా ఆగస్టు 22 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. కంపెనీ పాత పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు, వేరబుల్ గాడ్జెట్లు ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా కూడా అందుబాటులో ఉంటాయా లేదా అనే దానిపై గూగుల్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.

Read Also : Royal Enfield Classic 350 : డుగ్ డుగ్ బుల్లెట్ బండి వస్తోంది.. రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 లాంచ్ ఎప్పుడంటే? ఫీచర్లు చూస్తే ఫిదానే..!

ట్రెండింగ్ వార్తలు