Sugar Exports Ban : ఏడేళ్లలో మొదటిసారి చక్కెర ఎగుమతులపై నిషేధం ?

దేశంలో మళ్లీ చక్కెర ధరలు పెరగనున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. చక్కెర ధరలు పెరగకుండా కళ్లెం వేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఏడేళ్లలో మొదటిసారి చక్కెర ఎగుమతులపై నిషేధం విధించాలని యోచిస్తోంది....

Sugar Exports Ban

Sugar Exports Ban : దేశంలో మళ్లీ చక్కెర ధరలు పెరగనున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. చక్కెర ధరలు పెరగకుండా కళ్లెం వేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఏడేళ్లలో మొదటిసారి చక్కెర ఎగుమతులపై నిషేధం విధించాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలకు రెక్కలు వచ్చే అవకాశముండటంతో పాటు భారతదేశంలో చెరకు దిగుబడి గణనీయంగా తగ్గినందున చక్కెర ఎగుమతులను కేంద్రం నిలిపివేసే అవకాశం ఉంది. (Sugar Exports Ban)

Vegetable Prices Decline : సెప్టెంబరు నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం: ఆర్‌బీఐ చీఫ్‌ శక్తికాంతదాస్ వెల్లడి

భారతదేశం పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న నేపథ్యంలో సరఫరాలను స్థిరీకరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. (Sugar Exports for first time in 7 years) సరిపడా వర్షపాతం లేని కారణంగా చెరకు దిగుబడి తగ్గింది. దీంతో అక్టోబర్‌ నెలతో ప్రారంభమయ్యే తదుపరి సీజన్‌లో చక్కెర ఎగుమతులపై భారతదేశం నిషేధించవచ్చని మూడు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర, కర్ణాటకలలో రుతుపవనాల వర్షాలు సగటు కంటే 50 శాతం తక్కువగా కురవడంతో చెరకు దిగుబడి తగ్గింది. అత్యధికంగా చెరకు పండించే ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులతో దిగుబడి తగ్గనుంది.

Wagner chief Yevgeny Prigozhin : వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మాస్కో విమాన ప్రమాదంలో మృతి

దీంతో ప్రపంచ ఆహార మార్కెట్‌లలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. దీంతో ఏడేళ్లలో జరగని విధంగా చక్కెర ఎగుమతులై నిషేధాస్త్రం విధించనుందని సమాచారం. ఆహార ద్రవ్యోల్బణంపై భారతదేశం ఆందోళన చెందుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం జులై నెలలో 15 నెలల గరిష్ట స్థాయి 7.4 శాతానికి చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం 11.5 శాతానికి చేరుకుంది. ఇది మూడేళ్లలో అత్యధికం. రాబోయే 2023/24 సీజన్‌లో దేశంలో చక్కెర ఉత్పత్తి 3.3 శాతం అంటే 31.7 మిలియన్‌ టన్నులకు తగ్గవచ్చు.

Bathini Harinath Goud : చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ అధికారులు స్థానిక చక్కెర అవసరాలతో పాటు మిగులు చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తున్నారు. బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన సర్కారు తాజాగా చక్కెర ఎగుమతిని కూడా నిలిపివేయాలని యోచిస్తోంది. చక్కెర ఎగుమతులను నిలిపివేయాలని భారతదేశం తీసుకుబోయే నిర్ణయం ప్రపంచ చక్కెర మార్కెట్లు, ఆహార ధరలపై గణనీయమైన ప్రభావాలను చూపనుంది.

ట్రెండింగ్ వార్తలు