Restaurant on Wheels: కాచిగూడలో రెస్టారెంట్ ఆన్ వీల్స్.. వాకీ టాకీలో ఆర్డర్.. నోరూరించే రుచులు

హైదరాబాద్ కాచిగూడలో ఓ కొత్త రకం రెస్టారెంట్ సిద్ధమైంది. రైల్వేస్టేషన్ సమీపంలోనే సిద్ధమైన ఈ హోటల్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రైలు బోగీలనే రెస్టారెంట్‌గా మార్చేశారు.

Restaurant on Wheels started at Kacheguda

Restaurant in Train Coach : హైదరాబాద్ (Hyderabad) కాచిగూడలో రెస్టారెంట్ ఆన్ వీల్స్.. అవును మీరు వింటున్నది నిజమే.. రైలు చక్రాలపై రెస్టారెంట్‌ను సిద్ధం చేశారు కొంత మంది ఔత్సాహికులు. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రోత్సాహంతో కాచిగూడలో రైలు బోగీలను రెస్టారెంట్‌గా మార్చేశారు. అంతే కాదు ఇక్కడ దేశవ్యాప్తంగా దొరికే వివిధ రకాల రుచులను హైదరాబాదీలకు పరిచయం చేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ మొత్తంలో ఎక్కడా ఇలాంటి రెస్టారెంట్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్‌తో ముస్తాబైన హోటల్ లేదంటున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు.

హైదరాబాద్‌లో జైల్‌మండి, రైల్‌ మండి తరహాలో కాచిగూడ రైల్వేస్టేషన్‌ (Kacheguda railway station)లో పరివార్‌ ఫుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరిట ట్రైన్‌ రెస్టారెంట్‌ అందుబాటులోకి వచ్చింది. 24 గంటలూ ఈ రెస్టారెంట్‌లో సేవలు అందుబాటులో ఉంటాయి. రెండు కోచ్‌లతో ఈ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు. ఇందులో ఒకేసారి 120 మంది కస్టమర్లు కూర్చొని విందును ఆస్వాదించ వచ్చు.

హైదరాబాద్ కాచిగూడలో ఓ కొత్త రకం రెస్టారెంట్ సిద్ధమైంది. రైల్వేస్టేషన్ సమీపంలోనే సిద్ధమైన ఈ హోటల్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రైలు బోగీలనే రెస్టారెంట్‌గా మార్చేశారు. రైలు బోగీల నిండా ఎక్కడా బోగీలనే ఫీలింగ్ రాకుండా ఇంటీరియర్‌ను అందంగా ముస్తాబు చేశారు. బ్రిటీష్ కాలం నాటి అందమైన చిత్రాలను బోగీలో ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రతి డెకరేషన్ ఐటెమ్‌కు ఓ చరిత్ర ఉంది. ప్రతి చిత్రానికి విభిన్నమైన చరిత్ర ఉంది. బ్రిటన్ పరిపాలనను గుర్తుకు తెచ్చేలా రెస్టారెంట్‌ను అందంగా డెకరేట్ చేశారు.

Also Read: అప్పుల బాధల్ని తీర్చే దేవాలయం.. దీపం వెలిగిస్తే చాలు రుణబాధల్ని తొలగించే ఆపద్బాంధవుడు..

దక్షిణమధ్య రైల్వే వారి సహకారంతో ఈ వీల్స్ ఆన్ రెస్టారెంట్‌ను సిద్ధం చేశారు. రైల్వే శాఖ నుంచి రెండు బోగీలను సేకరించి వాటిని అందంగా ముస్తాబు చేశారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ ‘థీమ్‌ హోటల్‌’తో రైల్వేస్టేషన్‌కు మరింత అందం సంతరించింది. తెలంగాణలోనే ఇది మొట్టమొదటిసారి రైల్వే కోచ్‌లలో ఏర్పాటు చేసిన హోటల్‌ కావడం విశేషం. ఐదు సంవత్సరాల కాలపరిమితి కోసం సికింద్రాబాద్‌కు చెందిన మెస్సరస్‌ పరివార్స్‌ హావ్‌ మోర్‌కు ఈ రెస్టారెంట్‌ కోచ్‌లను లీజ్‌కు ఇచ్చారు. ఈ రెస్టారెంట్‌లో సౌతిండియన్, నార్త్ ఇండియన్ వంటకాలతోపాటు తెలంగాణ, మొఘలాటి, చైనీస్ వంటకాలు కూడా రుచిగా వండి వడ్డిస్తారు. ఓ కొత్త అనుభూతి కోరుకునే వారు ఎవరైనా ఈ రెస్టారెంట్‌లోకి అడుగు పెడితే మంచి ఫీల్‌ని ఎంజాయ్ చేస్తారని భరోసా ఇస్తున్నారు పూర్తిగా బంగారు వర్ణంలో రూపొందించిన ఈ రెస్టారెంట్ బిర్యానీ ప్రియులకు రైట్ డెస్టినేషన్ అంటున్నారు కస్టమర్లు.

Also Read: పగబట్టిన ఎద్దు.. రెండు గంటలు చెట్టుపైనే రైతు.. వీడియో వైరల్..

నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు రకరకాల పనుల కోసం సిటీకి వచ్చేవారికి కూడా ఈ రెస్టారెంట్ ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్‌గా మిగిలిపోయేలా రెస్టారెంట్‌ను సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో రకరకాల హోటళ్లు, రెస్టారెంట్లు చూశాం కానీ ఇలా రైలు బోగీల్లో ఏర్పాటు చేసిన తొలి రెస్టారెంట్ ఇదే అంటున్నారు హోటల్‌కు వచ్చిన కస్టమర్లు. ఈరెస్టారెంట్‌కు వచ్చిన వాళ్లకు కొత్త అనుభూతి దొరకడం ఖాయం అంటున్నారు. మరెందుకు ఆలస్యం వచ్చే వీకెండ్ మీరు ప్లాన్ చేసుకోండి కాచిగూడలోని వీల్స్‌ ఆన్ రెస్టారెంట్‌కు వెళ్లేందుకు.

ట్రెండింగ్ వార్తలు