UP Farmer Climbs Tree: పగబట్టిన ఎద్దు.. రెండు గంటలు చెట్టుపైనే రైతు.. వీడియో వైరల్.. అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర ట్వీట్

ఖఖ్ను అనే రైతు వెంట ఓ ఎద్దు పడింది. భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ రైతు చెట్టెక్కాడు. అయినా వదలకుండా రెండు గంటలపాటు రైతు చెట్టు దిగితే దాడిచేయాలని ఎద్దు కాచుకొని కూర్చుకుంది.

UP farmer climbs tree

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని బలియా జిల్లా (Ballia District) లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ ఎద్దు రైతును ముప్పుతిప్పలు పెట్టింది. పొలంలో పనిచేస్తున్న రైతును పొడిచేందుకు పరుగెత్తుకుంటూ ఎద్దురావడంతో అప్రమత్తమైన రైతు దాని నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు చెట్టెక్కాడు. అయినా ఆ ఎద్దు వదిలిపెట్టలేదు. రైతుపై పగబట్టినట్లుగా రెండు గంటలపాటు చెట్టవద్దనే నిలబడింది. దీంతో రైతు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. చివరికి కొందరు రైతులు అక్కడికి చేరుకొని దానిని తరిమేశారు. ఆ తరువాత హమ్మయ్య బతికిపోయా అనుకుంటూ రైతు చెట్టు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jaipur Express Train : జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు.. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి

శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఖఖ్ను అనే రైతు వెంట ఓ ఎద్దు పడింది. భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ రైతు చెట్టెక్కాడు. అయినా వదలకుండా రెండు గంటలపాటు రైతు చెట్టు దిగితే దాడిచేయాలని ఎద్దు కాచుకొని కూర్చుకుంది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం స్పందించారు. అయితే, ప్రభుత్వం తీరుపై అఖిలేష్ మండిపడ్డారు. అఖిలేష్ ఆగ్రహం వెనుక కారణం ఉంది. రైతును చెట్టెక్కేలా చేసిన ఎద్దు.. గత కొన్నిరోజులుగా 12 మందిని గాయపర్చిందట.

Uttar Pradesh: అయ్యయ్యో పొరబడిన మహిళ..! మతిస్థిమితం లేనివ్యక్తిని భర్త అనుకొని ఇంటికి తీసుకెళ్లింది.. అసలు విషయం తెలిసి..

ఇలాంటి ఎద్దులను అరికట్టేందుకు బుల్ ప్రొటెక్షన్ పోలీసులను ఏర్పాటు చేయాలని అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ఈ ప్రాంతంలో దారితప్పిన ఆవులను ఇప్పటి వరకు దాదాపు 3,910 వరకు సంరక్షణ కేంద్రాలకు తరలించామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం రైతును బయటపెట్టిన ఎద్దును పట్టుకొనేందుకు ఓ బృదం రంగంలోకి దిగింది. అయితే, రైతును చెట్టు దిగకుండా రెండు గంటలపాటు కాపులా కాసిన ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో నవ్వులుపూయించే కామెంట్లు చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు