Jharkhand : పోలీస్ స్టేషన్ లో మద్యం సేవించి డ్యాన్సులు.. ఐదుగురు పోలీసులు సస్పెండ్

జార్ఖండ్ గొడ్డా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో మద్యం తాగి డ్యాన్సులు చేసిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. కొందరు పోలీసులు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మద్యం సేవించారు. ఆ తర్వాత డ్యాన్సులు కూడా చేశారు.

Jharkhand : జార్ఖండ్ గొడ్డా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో మద్యం తాగి డ్యాన్సులు చేసిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. కొందరు పోలీసులు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మద్యం సేవించారు. ఆ తర్వాత డ్యాన్సులు కూడా చేశారు. హోలీ రోజున జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ స్టేషన్ లో మద్యం తాగి డ్యాన్సులు వేసిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

మహాగామ పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉన్న పోలీసులు హోలీ వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొందరు పోలీసులు మద్యం సేవించారు. అంతేకాకుండా మ్యూజిక్ కు అనుగుణంగా డ్యాన్సులు చేశారు. అయితే ఒకరు తన మొబైల్ లో రికార్డు చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జార్ఖండ్ మాజీ సీఎం బాబులాల్ మరాండీ ఈ వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Bihar : రాష్ట్రంలో మద్య నిషేధం .. స్టేషన్‌లోనే ఖైదీలతో కలిసి పోలీసుల మందు పార్టీ

సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. పోలీస్ స్టేషన్ లో మద్యం తాగి డ్యాన్సులు చేసిన ఐదుగురు పోలీసులను గొడ్డా ఎస్పీ నాథు సింగ్ మీనా సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన పోలీసుల్లో ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు.

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బిపిన్ బిహారీ రాయ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రాధా కృష్ణ సింగ్, కానిస్టేబుల్ సత్యేంద్ర నారాయణ్ సింగ్, కృష్ణ కుమార్ సింగ్, ప్యారే మోహన్ సింగ్ పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆ ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయం వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు