Anupama Parameswaran : విక్రమ్ తనయుడితో అనుపమ పరమేశ్వరన్.. సినిమా టైటిల్ అనౌన్స్.. 

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ సరసన అనుపమ సినిమా చేయబోతుంది.

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాతో హిట్ కొట్టింది. అనుపమ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని భాషల్లో సినిమాలు అనౌన్స్ చేస్తుంది. ఇటీవలే పరదా అనే ఓ సినిమా అనౌన్స్ చేసింది. తాజాగా మరో సినిమాని ప్రకటించింది అనుపమ. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) సరసన అనుపమ సినిమా చేయబోతుంది.

అప్లాస్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్స్ పై ధృవ్ విక్రమ్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా మామన్నన్ సినిమా దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘బైసన్’ అనే టైటిల్ ప్రకటించారు. ‘కాలమాదన్’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు ఈ టైటిల్ కి. ప్రస్తుతం తమిళ్ లోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి రిలీజ్ టైంకి తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా చూడాలి.

Also Read : Satya Trailer : సత్య ట్రైలర్ చూశారా? టెన్త్ క్లాస్ కుర్రోడి కథ..

టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ లో హీరో మోకాళ్ళ మీద పరిగెత్తే పొజిషన్ లో కూర్చోగా, వెనకాల భారీ దున్నపోతు బొమ్మ ఉంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా అని తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు