Satya Trailer : సత్య ట్రైలర్ చూశారా? టెన్త్ క్లాస్ కుర్రోడి కథ..

తాజాగా 'సత్య' ట్రైలర్ రిలీజ్ చేశారు.

Satya Trailer : సత్య ట్రైలర్ చూశారా? టెన్త్ క్లాస్ కుర్రోడి కథ..

New Small Film with 10th class Boy story Satya Trailer Released

Satya Trailer : ఇటీవల ప్రేమ కథలు, కాలేజీ, స్కూల్ కథలు తక్కువగా వస్తున్నాయి. ఆ కోవలో ‘సత్య’ అనే సినిమా రాబోతుంది. గతంలో టెన్త్ క్లాస్, ప్రేమిస్తే లాంటి స్కూల్ లవ్ స్టోరీలు వచ్చాయి. ఇటీవల అలాంటి స్టోరీలు రావట్లేదు. తమిళ్ లో హిట్ అయిన రంగోలి సినిమా ఇప్పుడు తెలుగులో సత్య గా రిలీజ్ కాబోతుంది. ఓ టెన్త్ క్లాస్ కుర్రాడి కథగా సత్య సినిమా రాబోతుంది. హమరేష్, మురుగ దాస్, ప్రార్థన, అమిత్ భార్గవ్, సంజయ్.. పలువురు కొత్తవాళ్లతో ఈ సినిమాని తెరకెక్కించారు. సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో సత్య సినిమా తెరకెక్కింది.

Also Read : Devara Update : ఎన్టీఆర్ అటు ‘వార్ 2’.. ఇటు ‘దేవర’.. దేవర షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

టెన్త్ క్లాస్ చదువులు, ఆటలు, ఓ గ్రౌండ్ గురించి గొడవ, స్కూల్ గొడవలు, స్కూల్ లో లవ్ స్టోరీ.. ఇలా బోలెడన్ని అంశాలతో సత్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మే 10న రిలీజ్ కాబోతుంది. తాజాగా ‘సత్య’ ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి.

 

 

ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి డైరెక్టర్స్ కృష్ణ చైతన్య, శశికిరణ్ తిక్క, సతీష్ వేగేశ్న, పవన్ సాధినేని, అర్జున్, నిర్మాత మధుర శ్రీధర్.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఒక ఫోటోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి సీనియర్ జర్నలిస్ట్ గా ఎదిగి ఇప్పుడు నిర్మాతగా మారిన శివ మల్లాలని అందరూ అభినందించారు. ఆయన జర్నీని గుర్తుచేసుకుంటూ, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

సత్య మూవీ హీరో హీరోయిన్స్ ప్రార్ధన, హమరేష్, డైరెక్టర్ వాలి మోహన్ దాస్ ఈవెంట్ కి హాజరయి.. తమిళ్ లో హిట్ అయిన రంగోలి సినిమాని తెలుగులో శివ గారు రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

satya movie

ఇక నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ.. ఈ సినిమా చూసినప్పుడు కేవలం రివ్యూ చెపుదాం అనుకున్నాను. కానీ బాగా నచ్చి నేనే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. సినిమా చూడగానే డైరెక్టర్ వాలికి ఫోన్ చేసి అభినందించాను. నెక్స్ట్ సినిమాకి వాలికి తెల్లవారుజామున అడ్వాన్స్ ఇచ్చాను. ఇవాళ నా సినిమా సపోర్ట్ చేయడానికి 8 మంది డైరెక్టర్స్ వచ్చారు అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక ఫోటోగ్రాఫర్ గా మొదలయి ఇవాళ నిర్మాత వరకు వచ్చానంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ నా ధన్యవాదాలు. సత్య సినిమా మే 10న రిలీజ్ అవుతుంది, థియేటర్స్ లో చూడండి అని తెలిపారు.