Movie Shootings : షూటింగ్లో బిజీగా హీరోలు.. ఏ సినిమా ఎక్కడ షూట్ చేస్తున్నారంటే.. ప్రభాస్ ‘రాజాసాబ్’ షూటింగ్ అప్డేట్..

టాలీవుడ్ లో ఏ సినిమా, ఏ హీరో షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే..

Movie Shooting Updates : సమ్మర్లో సినిమా రిలీజ్ లు ఎక్కువ ఉండాలి. కానీ ఎన్నికలు, ఐపీఎల్ ఉండటంతో స్టార్ హీరోలెవరూ సమ్మర్ బరిలో లేరు. దీంతో చిన్న, మీడియం సినిమాలన్నీ థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఇక మన స్టార్ హీరోలంతా భారీ సినిమాలతో బిజీగా ఉండటంతో శరవేగంగా షూటింగ్స్ చేసుకుంటున్నారు. ఏ సినిమా, ఏ హీరో షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే..

#శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నేటి నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ షూటింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

#ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

# సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సీక్వెల్ ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.

#ఇక ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ బిజీతో ముంబైలో ఉన్నా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా షూట్ నేటి నుంచి వైజాగ్ లో జరుగుతుంది. ఎన్టీఆర్ లేని సీన్స్ షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ షూట్ లో సైఫ్ అలీఖాన్ పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.

Also Read : Geethanjali Malli Vachindi : ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ఓటీటీకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఎక్కడ?

#నాని ‘సరిపోదా శనివారం’ సినిమా షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

#నితిన్ – వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘తమ్ముడు’ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.

#రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ‘డబల్ ఇస్మార్ట్’ నిన్నే ముంబైలో షూటింగ్ మొదలుపెట్టారు.

#నాగ చైతన్య – చందు మొండేటి కాంబోలో వస్తున్న భారీ సినిమా ‘తండేల్’ హైదరాబాద్ bhel లో వేసిన భారీ సెట్లో జరుగుతుంది.

#శర్వానంద్ – రామ్ అబ్బరాజు కాంబోలో తెరకెక్కుతున్న ఏకే ఎంటరటైన్మెంట్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది.

#మంచు విష్ణు ‘భక్త కన్నప్ప’ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతుంది

 

ట్రెండింగ్ వార్తలు