Odisha Train Accident: భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం.. రైలు ప్రమాదాల పర్వం

ఒడిశా రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనది.మహా విషాద ఘటనగా రైల్వే చరిత్రలో నిలిచింది.

Odisha Train Crash : ఒడిశా రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనది.మహా విషాద ఘటనగా రైల్వే చరిత్రలో నిలిచింది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌ – చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైలు ఢీకొని ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 233 మంది మరణించగా, మరో 900 మందికి పైగా గాయపడ్డారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన రైలు ప్రమాదాలను పరిశీలిస్తే ఒడిశా రైలు ప్రమాదం పెద్దదని చెప్పవచ్చు.

Odisha trains accident: ఒడిశా రైళ్ల ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య…233కి దాటిన మృతుల సంఖ్య

1981 వ సంవత్సరం జూన్ 6వ తేదీన బీహార్ రాష్ట్రంలో రైలు భాగమతి నది వంతెనపై నుంచి రైలు దాటుతుండగా ప్రమాదావశాత్తూ నదిలో పడి 750 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. 1995వ సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ఫిరోజాబాద్ సమీపంలో కాళింది ఎక్స్ ప్రెస్ ను పురుషోత్తం ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో 305 మంది ప్రయాణికులు మరణించారు. 1998వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన జమ్మూతావి-సీల్ధా ఎక్స్ ప్రెస్ రైలు పంజాబ్ రాష్ట్రంలోని ఖన్నా ఫ్రాంటియర్ గోల్డెన్ టెంపుల్ మెయిల్ పట్టాలు తప్పిన ఘటనలో 212 మంది మరణించారు.

Railways Minister Ashwini Vaishnaw: ఒడిశా రైళ్ల ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ

1999 వ సంవత్సరం ఆగస్టు 2వతేదీన నార్త్ ఫ్రాంటియర్ రైల్వేలోని కతిహార్ డివిజన్‌లోని గైసల్ స్టేషన్‌లో బ్రహ్మపుత్ర మెయిల్ నిశ్చలంగా ఉన్న అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్నప్పుడు గైసల్ రైలు ప్రమాదం సంభవించింది.ఈ రైలు ప్రమాదంలో 285 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో చాలా మంది ఆర్మీ, బీఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారు. రైలు ప్రమాద విషాదం నేపథ్యంలో ఒడిశా రాష్ట్రానికి ఒకరోజు సంతాప దినం పాటించనుంది.

Odisha trains accident: మూడు రైళ్ల ఢీ: 207 మంది దుర్మరణం, 900 మందికి గాయాలు
ఘోర రైలు ప్రమాదాలు…
-2016వ సంవత్సరం నవంబర్ 20వ తేదీన ఇండోర్-రాజేంద్ర నగర్ ఎక్స్‌ప్రెస్ యొక్క 14 కోచ్‌లు కాన్పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుఖ్రాయాన్ వద్ద పట్టాలు తప్పడంతో 152 మంది మరణించారు.ఈ ఘటనలో మరో 260 మంది గాయపడ్డారు.

– 2002వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన రఫీగంజ్‌లోని ధవే నదిపై ఉన్న వంతెనపై హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో రఫీగంజ్ రైలు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 140 మందికి పైగా మరణించారు. ఈ ఘటనకు ఉగ్రవాద విధ్వంసమే కారణమని ఆరోపించారు.

– 1964 వసంవత్సరం డిసెంబర్ 23వ తేదీన రామేశ్వరం తుపాను కారణంగా పాంబన్-ధనుస్కోడి ప్యాసింజర్ రైలు కొట్టుకుపోవడంతో అందులో ఉన్న 126 మంది ప్రయాణికులు మరణించారు.

-2010వ సంవత్సరం మే 28వ తేదీన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ముంబైకి వెళ్లే రైలు జార్‌గ్రామ్ సమీపంలో పట్టాలు తప్పింది. ఆపై ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొనడంతో 148 మంది ప్రయాణికులు మరణించారు.

ట్రెండింగ్ వార్తలు