Manipur Violence: మణిపూర్ దారుణ వీడియో ఘటన.. ఎట్టకేలకు కీలక నిందితుడి అరెస్ట్

వీడియోల సర్క్యులేషన్‌పై ట్విట్టర్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం ఉంది. ఈ వీడియో వల్ల శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ఇది చట్టం ప్రకారం అనుమతించబడదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Manipur: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన భయానక వీడియో ఇంటర్నెట్‌లో కనిపించిన ఒక రోజు అనంతరం దేశంలో పెద్ద కుదుపు వచ్చింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ఈ వీడియోపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి గురువారం కీలక నిందితుడిని అరెస్టు చేశారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ (Chief Minister N Biren Singh) ఒక ట్వీట్ ద్వారా అరెస్టును ప్రకటించారు. నిందితులకు అవసరమైతే మరణశిక్ష విధిస్తామని అంతకు ముందు ప్రకటించిన ఆయన.. తమ ప్రభుత్వం దోషులందరిపై కఠిన చర్యలు తీసుకుందని అన్నారు.

Manipur Violence: మీరు చర్యలు తీసుకోకుంటే మేం రంగంలోకి దిగుతాం.. మణిపూర్ దారుణంపై కేంద్రానికి సుప్రీకోర్టు వార్నింగ్

కాగా అరెస్ట్ చేసిన నిందితుడు పేరు హెరాదాస్-32(Heradas). ఇతడు తౌబాల్ జిల్లాకు చెందిన వ్యక్తి. కాగా, ఆ వైరల్ అయిన వీడియో ఆకుపచ్చ టీ-షర్టును వ్యక్తి అతడని పోలీసులు తెలిపారు. మే నెలలో కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన ఈ భయంకరమైన ఘటన వీడియోపై ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు నుంచి తీవ్ర స్థాయిలో ఖండన వచ్చింది. మణిపూర్‌ కుమార్తెలకు జరిగిన దాన్ని ఎప్పటికీ క్షమించలేం. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని, దోషులను వదిలిపెట్టబోమని పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Manipur Violence: పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ ప్రకంపనలు.. వాయిదా తీర్మానాలు ఇచ్చిన విపక్షాలు

భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పందిస్తూ.. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతంలో మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల గురించి కోర్టుకు తెలియజేయాలని కోరారు. వీడియోల సర్క్యులేషన్‌పై ట్విట్టర్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం ఉంది. ఈ వీడియో వల్ల శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ఇది చట్టం ప్రకారం అనుమతించబడదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

PM Modi to Sonia Gandhi: సోనియా దగ్గరికి వెళ్లి మరీ పలకరించచిన మోదీ.. పార్లమెంటులో ఆసక్తికర ఘటన

షెడ్యూల్డ్ తెగల హోదా కోసం మణిపూర్‌ లోయలోని మెజారిటీ మైతీ, కొండలు ఎక్కువగా ఉండే కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన ఒక రోజు తర్వాత మే 4న ఈ సంఘటన జరిగింది. జాతి హింసలో 120 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రాయులయ్యారు. ఇప్పుడు చాలా మంది సహాయ శిబిరాల్లో నివసిస్తున్నారు. మరోవైపు మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మణిపూర్‌పై ఇప్పటికే పది మంది ప్రతిపక్ష ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు