PM Modi to Sonia Gandhi: సోనియా దగ్గరికి వెళ్లి మరీ పలకరించిన మోదీ.. పార్లమెంటులో ఆసక్తికర ఘటన

రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ చార్టెడ్ ఫ్లైట్ లో ఆక్సీజన్ మాస్క్ పెట్టుకుని ఉన్న సోనియా గాంధీ ఫొటో చేశారు. అనంతరం ‘‘ఇంత ఒత్తిడిలోనూ చాలా దయతో ఉన్నారు’’ అనే అర్థంలో పోస్టు పెట్టారు

Parliament Sonsoon Session: పార్లమెంటులో ఆసక్తికర పరిణామం చేసుచేసుకుంది. ఉప్పూ-నిప్పుగా ఉండే ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ మధ్య కొంత సంభాషణ కొనసాగింది. మోదీయే స్వయంగా సోనియా కూర్చున్న చోటుకి వెళ్లి ఆమెను పలకరించారు. ఆమె ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. బుధవారం సోనియా ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ సాంకేతిక లోపం కారణంగా భోపాల్‭లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ కారణం చేతనే సోనియా ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు.

Manipur Violence: మీరు చర్యలు తీసుకోకుంటే మేం రంగంలోకి దిగుతాం.. మణిపూర్ దారుణంపై కేంద్రానికి సుప్రీకోర్టు వార్నింగ్

తాను బాగానే ఉన్నానని మోదీకి సోనియా బదులిచ్చారు. ఈ సందర్భంగా గురించి బుధవారం రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ చార్టెడ్ ఫ్లైట్ లో ఆక్సీజన్ మాస్క్ పెట్టుకుని ఉన్న సోనియా గాంధీ ఫొటో చేశారు. అనంతరం ‘‘ఇంత ఒత్తిడిలోనూ చాలా దయతో ఉన్నారు’’ అనే అర్థంలో పోస్టు పెట్టారు. విపక్షాల సమావేశం కోసం బెంగళూరు వచ్చిన సోనియా.. తిరిగి ఢిల్లీ వెళ్తుండగా చార్టెడ్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‭లో అత్యవసరంగా ల్యాండింగ్ తీసుకున్నారు. అనంతరం బుధవారం రాత్రి 9:30 గంటలకు అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరారు.

Manipur Violence: పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ ప్రకంపనలు.. వాయిదా తీర్మానాలు ఇచ్చిన విపక్షాలు

వర్షాకాల సమావేశాల తొలిరోజు అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంటుకు హాజరయ్యారు. మణిపూర్ హింసాకాండపై మోదీ స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ తన ఐకమత్యాన్ని చాటుకోవడానికి ఈ సమావేశాలు ఓ వేదికగా ఉపయోగపడబోతున్నాయి. ఇందుకు అనుగుణంగానే విపక్షాలు ఒకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు