Ganja Seized : హైదరాబాద్‌లో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

రాచకొండ పోలీసు  కమీషనరేట్ పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్నఅంతరాష్ట్ర ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Ganja Seized :  రాచకొండ పోలీసు  కమీషనరేట్ పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్నఅంతరాష్ట్ర ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్దనుంచి 1240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో   దీని విలువ సుమారు 2.08 కోట్లు  వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ముందస్తుగా అందిన సమాచారం మేరకు ఎస్వోటీ  పోలీసులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిలో తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవా,టాటా వాహనాలలో తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు తప్పించుకు పారిపోయారని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పారు.

Also Read : Karthika Deepotsavam : కార్తీక దీపోత్సవానికి హాజరుకండి-కర్ణాటక సిఎం ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్

గంజాయిని విశాఖపట్నం ఏరియా నుండి ముంబై మహారాష్ట్ర కు తరలిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్ యాసిన్ అలియాస్ ఫిరోజ్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతూ ఈ దందా చేస్తున్నాడని, ప్రస్తుతం ఫిరోజ్ తో పాటు ఇద్దరు డ్రైవర్లు రవీందర్, మధు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు.  నిందితుల వద్ద నుండి మూడు వాహనాలు, 5 వేలు నగదు,2 మొబైల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ 6 సీజ్ చేసామని ఆయన తెలిపారు. నిందితుల పైన NDPS యాక్ట్ తో పాటు పిడీ యాక్ట్ సైతం నమోదు చేస్తామని మహేష్ భగవత్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు