Terrorists killed: భారత్‌లోకి అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు పాకిస్తానీల కాల్చివేత

దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్తాన్ తీవ్రవాదుల్ని భారత సైన్యం కాల్చి చంపింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత రాజౌరి సెక్టర్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Terrorists killed: భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్తానీలను ఇండియన్ ఆర్మీ కాల్చి చంపింది. జమ్ము-కాశ్మీర్, రాజౌరి జిల్లా, నౌషేరా సెక్టార్ పరిధిలోని ఎల్ఓసీ వద్ద సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. సోమవారం సరిహద్దులో భద్రతా దళం గస్తీ కాస్తుండగా, ఇద్దరు పాకిస్తానీలు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు.

Raja Singh: పార్టీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ

రాత్రిపూట చీకట్లో సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా, ఒక ల్యాండ్‌మైన్ పేలింది. ఇది గుర్తించిన సైన్యం వెంటనే అప్రమత్తమైంది. సరిహద్దు వెంట గస్తీ నిర్వహించింది. ఈ దశలో ఇద్దరు చొరబాటుదారుల్ని గుర్తించిన సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు చొరబాటుదారులు మరణించారు. వీరిద్దరినీ తీవ్రవాదులుగా అనుమానిస్తున్నారు. తర్వాత వారి మృతదేహాల్ని సైన్యం స్వాధీనం చేసుకుంది.

Bilkis Bano: బిల్కిస్ బానో కేసు నిందితుల విడుదలపై సుప్రీకోర్టులో పిల్

ఈ ప్రాంతంలో ఇంకెవరైనా చొరబాటుదారులు వచ్చారా అనే కోణంలో అన్ని చోట్లా మరింత భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు సైనికాధికారులు తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు