Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు గిఫ్ట్ ఇచ్చిన వదినమ్మ సురేఖ.. వీడియో

సురేఖ స్వయంగా ఆ పెన్నును పవన్ కల్యాణ్ జేబులో పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తన సోదరుడు చిరంజీవి కుటుంబాన్ని కలిశారు.

హైదరాబాద్ లోని తమ ఇంటికి వచ్చిన పవన్ కల్యాణ్ కు ఆయన వదిన సురేఖ ఖరీదైన పెన్నును ఇచ్చారు. సురేఖ స్వయంగా ఆ పెన్నును పవన్ కల్యాణ్ జేబులో పెట్టారు. ఈ మోంట్ బ్లాంక్ పెన్ను ధర రూ.90 వేలు-రూ.2.60 లక్షల మధ్య ఉంటుంది. పవన్ కు సురేఖ పెన్ను ఇస్తుండగా తీసిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు.

చిరంజీవి, సురేఖ, పవన్ కల్యాణ్, పవన్ భార్య అన్నాలెజినోవా ఫొటోలు దిగారు. పవన్ కు సురేఖ పెన్ను ఇచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి మెగా కుటుంబ సభ్యులతో గడిపిన విషయం తెలిసిందే.

Also Read: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు