Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని..

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల సమస్యలను తాను స్వయంగా చూశానని చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు.

తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక.. ఈ శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవని తెలిపారు.

ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా తాను భావిస్తున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. విశాఖ మన్యంలో పర్యటిస్తున్నపుడు కురిడి అనే గిరిజన గ్రామంలో మహిళలు నీళ్ల కోసం పడుతున్న అవస్థలను చెప్పారని అన్నారు.

Also Read: గందరగోళ పరిస్థితి నెలకొంది: బాల్క సుమన్

ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఎనలేని సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ప్రజలతో నేరుగా సంబంధ భాందవ్యాలు కలిగిన మంత్రిత్వ శాఖలు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.