VBIT Photos Morphing Case : VBIT కాలేజీ అమ్మాయిల ఫోటోల మార్ఫింగ్ కేసులో పురోగతి.. ఆ నలుగురు అరెస్ట్

వీబీఐటీ కాలేజీ విద్యార్థినుల ఫోటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో పోలీసులు నలుగురు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి నూడ్ పిక్చర్స్ గా మార్చి బెదిరింపులకు పాల్పడ్డ పోకిరీల్లో విజయవాడకు చెందిన ప్రదీప్ తో పాటు మరో ముగ్గురిని తాజాగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

VBIT Photos Morphing Case : వీబీఐటీ కాలేజీ విద్యార్థినుల ఫోటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో పోలీసులు నలుగురు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి నూడ్ పిక్చర్స్ గా మార్చి బెదిరింపులకు పాల్పడ్డ పోకిరీల్లో విజయవాడకు చెందిన ప్రదీప్ తో పాటు మరో ముగ్గురిని తాజాగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటోల మార్ఫింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి నూడ్ పిక్చర్స్ గా మార్చి బ్లాక్ మెయిల్ చేయడం కలకలం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. రెండు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసిన పోలీసులు.. నలుగురు కంత్రీగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

Also Read..VBIT Photos Morphing Case : కటకటాల్లోకి సైకోలు.. VBIT కాలేజ్ మార్ఫింగ్ కేసులో ముగ్గురు కేటుగాళ్లు అరెస్ట్

రాచకొండ కమిషనర్ ఈ కేసు వివరాలు మీడియాకు తెలిపారు. ఫోటో మార్ఫింగ్ వెనుక మొత్తం స్టోరీని ఆయన వివరించారు. నిందితులు ఏ విధంగా అమ్మాయిల కాంటాక్ట్స్ సంపాదించారు, ఫొటోలు ఏ విధంగా సేకరించారు, ఎవరెవరిని టార్గెట్ చేశారు, కాలేజీలో ఎవరి నుంచి వారికి సపోర్ట్ లభించింది.. ఈ వివరాలన్నీ పోలీసులు వెల్లడించారు.

నిందితులు.. కాలేజీ హాస్టల్ లో ఉండే అమ్మాయిలను టార్గెట్ గా చేసుకున్నారు. వారి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వారి ఫోటోలు సేకరించారు. వాటిని మార్ఫింగ్ చేసి నూడ్ పిక్చర్స్ గా మార్చడం, వాటిని తిరిగి వారికే పంపడం, బ్లాక్ మెయిల్ చేయడం.. ఇదీ నిందితుల తీరు.

అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌ నగర శివారు ఘట్ కేసర్‌లోని వీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీ అమ్మాయిల ఫోటోల మార్ఫింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. నిన్న ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read..Delhi Anjali Case : పగిలిన తల, బయటకొచ్చిన ఎముకలు, ఇంకా దొరకని మొదడు.. ఢిల్లీ అంజలి కేసులో ఒళ్లు జలదరించే విషయాలు

విజయవాడకు చెందిన ప్రధాన నిందితుడు ప్రదీప్‌కి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. దాంతో.. ఆ అమ్మాయి నెంబర్ తీసుకుని అసలు కథ మొదలుపెట్టాడు. ఒక గ్రూపు క్రియేట్ చేసి సదరు అమ్మాయితో పాటు ఆమె స్నేహితులను కూడా ఆ గ్రూపులో యాడ్ చేశాడు. అనంతరం వారి ఫోటోలను తీసుకొని మార్ఫింగ్ చేయటం మొదలు పెట్టాడు.

ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. అందులో ఇంజినీరింగ్ కాలేజ్ అమ్మాయిలు చేరేటట్లుగా బలవంతం చేసి.. అనంతరం వాళ్ల ఫోన్లను హ్యాక్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అమ్మాయిలు సోషల్ మీడియా అకౌంట్లకు పెట్టుకున్న డీపీలతో పాటు పర్సనల్ ఫొటోలను తీసుకుని వాటిని మార్ఫింగ్ చేసి నూడ్ ఫోటోలుగా మార్చారు. వాటిని తిరిగి అమ్మాయిలకు పంపి బ్లాక్ మెయిల్ కు దిగారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తాము చెప్పినట్లుగా చేయకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇంజినీరింగ్ కాలేజీలో కలకలం రేగింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. స్పందించిన కాలేజీ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు తమ దర్యాఫ్తులో మార్ఫింగ్ కంత్రీగాళ్లను గుర్తించి కటకటాల్లోకి నెట్టారు.

ట్రెండింగ్ వార్తలు