Cyber Fraud : గూగుల్‌‌లో సెర్చ్ చేసి రూ. 19 వేలు పొగొట్టుకొన్న యువతి

క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగూల్ లో సెర్చి చేసిన యువతి..మోసపోయింది. దాదాపు రూ. 19 వేల రూపాయలను కాజేశాడు గుర్తు తెలియని వ్యక్తి.

Young Lady Loses : ఏదైనా బ్యాంకుకు సంబంధించి…ఇతరత్రా వాటికి గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు కొందరు. కానీ..అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి..సమాచారం తెలుసుకోవాలని, వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పవద్దని ఎంతమంది చెబుతున్నా…కొంతమంది వినిపించుకోవడం లేదు. ఫలితంగా…వేలు, లక్షల డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా…క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగూల్ లో సెర్చి చేసిన యువతి..మోసపోయింది. దాదాపు రూ. 19 వేల రూపాయలను కాజేశాడు గుర్తు తెలియని వ్యక్తి. ఈ ఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

Read More : Chandrababu : అమర జవాన్ సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి : చంద్రబాబు

సీఐ ఎండి వాహిదుద్దీన్ దీనికి సంబంధించిన విషయాలు చెప్పారు. బాలానగర్ డివిజన్ పరిధిలో రాజు కాలనీకి చెందిన ఓ యువతి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 03వ తేదీన క్రెడిట్ కార్డు యొక్క ఈఎంఐ (EMI) డ్యూ డేట్ ను మార్చుకోవడానికి గూగుల్ లో సెర్చ్ చేయగా 7718320995 అనే ఫోన్ నెంబర్ కనిపించింది. ఆ నెంబర్ కు ఫోన్ చేశారు. కానీ..కట్ అయ్యింది. కొద్దిసేపటి అనంతరం అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. హిందీలో మాట్లాడాడు.

Read More : Bipin Rawat’s Final Journey : దళపతి బిపిన్ రావత్ అంతిమయాత్ర- Live Updates

ఈఎంఐ డ్యూ డేట్ మార్చాలని సూచించారు. ఎనీ డెస్క్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని..అందులో వచ్చిన కోడ్ ను చెప్పాలని కోరగా..అదే విధంగా చేయగా…రూ. 19 వేల 740 రూపాయలు కట్ అయ్యాయి. మరలా ఫోన్ చేయగా…అది పని చేయలేదు. తాను మోసపోయానని గ్రహించి…బాలానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు