28 Years After Job : దరఖాస్తు చేసిన 28 ఏళ్లకు ఉద్యోగం.. పోస్టల్ అసిస్టెంట్ గా నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశం

మెరిట్ సాధించినప్పటికీ అంకుర్ గుప్తాను ఓకేషనల్ స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడయ్యారని అతనికి ఉద్యోగం ఇవ్వడానికి తపాలా శాఖ నిరాకరించింది.

Postal Assistant job

28 Years After Man Get Job : ఉత్తరప్రదేశ్ లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం ఓ వ్యక్తి చేసిన పోరాటం ఫలించింది. దరఖాస్తు చేసుకున్న 28 ఏళ్లకు ఉద్యోగం వచ్చింది. తపాలా శాఖలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం 28 ఏళ్ల క్రితం అంకుర్ గుప్తా అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే మెరిట్ సాధించినప్పటికీ అంకుర్ గుప్తాను ఓకేషనల్ స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడయ్యారని అతనికి ఉద్యోగం ఇవ్వడానికి తపాలా శాఖ నిరాకరించింది. దీంతో 1996లో ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. 1999లో అంకుర్ గుప్తాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

Kerala High Court : జడ్జీలు దేవుళ్లు కాదు.. వాళ్లెదుట చేతులు కట్టుకోవాల్సినవసరం లేదు : కేరళ హైకోర్టు

పోస్టల్ డిపార్ట్ మెంట్ ఈ తీర్పును 2000లో అలహాబాద్ హైకోర్టులో, అనంతరం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో నెలలోపు అంకుర్ ను పోస్టల్ అసిస్టెంట్ గా నియమించాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అంకుర్ గుప్తా 28 ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించింది. ప్రస్తుతం అతని వయస్సు 50.

ట్రెండింగ్ వార్తలు