Union Bank of India Jobs : రూ.78వేల జీతంతో 347 జాబ్స్.. రెండు రోజులే గడువు

ప్రభుత్వ బ్యాంకులో జాబ్ కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 347 పోస్టులు (సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజ

Union Bank of India Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్ కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 347 పోస్టులు (సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్) భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 3తో దరఖాస్తు గడువు ముగియనుంది. అంటే మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్‌లో విద్యార్హతలు తెలుసుకోవాలి. పోస్టులును బట్టి డిగ్రీ సహా విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా వారు రూ.850 ఫీజు చెల్లించాలి.

మొత్తం ఖాళీలు 347

సీనియర్ మేనేజర్ (రిస్క్) 60
మేనేజర్ (రిస్క్) 60
మేనేజర్ (సివిల్ ఇంజనీర్) 7
మేనేజర్ (ఆర్కిటెక్ట్) 7
మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీర్) 2
మేనేజర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్) 1
మేనేజర్ (ఫారెక్స్) 50
మేనేజర్ (చార్టెర్డ్ అకౌంటెంట్) 14
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్) 26
అసిస్టెంట్ మేనేజర్ (ఫారెక్స్) 120

New PF Rule : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయకపోతే నష్టపోతారు

దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్టు 12

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 3

ఆన్‌లైన్ ఎగ్జామ్- 2021 అక్టోబర్ 9

విద్యార్హతలు: పోస్టులను బట్టి వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులను బట్టి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.

వయసు: సీనియర్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకునే అభ్యర్థుల వయస్సు 30-40 ఏళ్లు, మేనేజర్ ఉద్యోగాలకు 25-35 ఏళ్లు ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 20-30 ఏళ్లు ఉండాలి.

ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయస్సులో సడలింపు.

Life Expectancy : వాయుకాలుష్యంతో భారతీయుల ఆయుర్దాయం 9 ఏళ్లు తగ్గిపోవచ్చు!

దరఖాస్తు ఫీజు..
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.850.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులకు ఫీజు లేదు

ఎంపిక విధానం- ఆన్‌లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ https://www.unionbankofindia.co.in/ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.

వెబ్‌సైట్‌:https://www.unionbankofindia.co.in/

వేతనం- రూ.63840 నుంచి రూ.78230 వరకు

ట్రెండింగ్ వార్తలు