Sugar Disease : రోజూ ఇది తింటే షుగర్ డిసీజ్ కి చెక్ పెట్టొచ్చు

బిర్యానీ ఎక్కువగా తింటే సమస్య అవుతుందేమో గానీ దానిలో వాడే దాల్చిన చెక్క మాత్రం మధుమేహ రోగులకు మాత్రం వరమే.

sugar disease

Sugar Disease : ప్రపంచ ఆరోగ్య సమస్యల్లో ముందుండేది మధుమేహం. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ తో బాధపడేవాళ్లు మన ఇండియాలోనే ఎక్కువమందని అనేక సర్వేల్లో తేలింది. ప్రపంచ డయాబెటిస్ రాజధాని ఇండియా అయితే, మనదేశానికి డయాబెటిస్ రాజధాని హైదరాబాద్ అంటారు. అందుకే ఇప్పుడు ఏ ఇంట చూసినా డయాబెటిస్ ఉన్నవాళ్లు ఒక్కరైనా ఉంటున్నారు. మన శరీరంలో ఉండే క్లోమ గ్రంథి అంటే పాంక్రియాస్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. మారిన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి జీవనశైలి వల్ల మధుమేహ సమస్య ఇప్పుడు ఎక్కువ అవుతోంది. దీనికి మన ఇంట్లోనే మంచి మందు ఉందంటున్నారు నిపుణులు.

READ ALSO : Drinking Too Much Tea : మోతాదుకు మించి టీ తాగటం వల్ల కలిగే ఆరోగ్యపరమైన అనర్ధాలు

నిజానికి చాలా రకాల జబ్బులకు మన ఇంట్లోనే.. మనం కిచెన్ లో వాడే అనేక రకాల పదార్థాలే ఔషధాలుగా కూడా పనిచేస్తాయి. స్పైసెస్ ఎక్కువగా తీసుకోవద్దు అంటుండడం విన్నాం. కానీ వాటిలో ఆరోగ్యాన్నిచ్చే సుగుణాలు కూడా ఉన్నాయని అనేక పరిశోధనల్లో తేలింది. ఈ సుగంధ ద్రవ్యాలే డయాబెటిస్ తో బాధపడేవాళ్లకు కూడా ఉపశమనం కలిగించగలవని ఇటీవలి అధ్యయనాల్లో స్పష్టమైంది.

బిర్యానీకి అంత మంచి వాసన కలిగించే వాటిలో దాల్చిన చెక్క ఒకటి. బిర్యానీ ఎక్కువగా తింటే సమస్య అవుతుందేమో గానీ దానిలో వాడే దాల్చిన చెక్క మాత్రం మధుమేహ రోగులకు మాత్రం వరమే. మన వంటల్లో వాడే దాల్చిన చెక్కకు మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉందట. గుండెజబ్బుల రిస్కు కూడా తగ్గిస్తుందట.

READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !

దాల్చిన చెక్క ఇన్సులిన్సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. తద్వారా డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది. దీనిలో ఉండే యాంటి ఇన్ ఫ్లమేటరీ, యాంటి ఆక్సిడెంట్ గుణాలు మధుమేహం వల్ల వచ్చే సమస్యలైన బీపీ, గుండెజబ్బుల రిస్కు తగ్గడానికి సహాయపడతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లకు దాల్చిన చెక్క సప్లిమెంట్లు రోజుకి 120 మి.గ్రా. నుంచి 600 మి.గ్రా.లను16 వారాల పాటు ఇచ్చినప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తగ్గిందట. అందుకే రోజుకో చిన్న దాల్చిన చెక్క ముక్కను నోట్లో వేసుకోండి.

 

ట్రెండింగ్ వార్తలు