Low Fat vs Low Carb : తక్కువ కొవ్వు vs తక్కువ కార్బ్.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైనది?

డైటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తే పిండి పదార్థాలు, కొవ్వును నివారించడం ద్వారా కేలరీలను తగ్గించవచ్చు. దీంతో క్యాలరీ వినియోగం తగ్గుతుంది. ఇది కేలరీల లోటుకు దారితీస్తుంది. అందువల్ల బరువు తగ్గుతారు. పిండి పదార్థాలు నీటి బరువును కలిగి ఉన్నందున తక్కువ కార్బ్ ఆహారం మంచి అనుభూతిని కలిగిస్తుంది.

బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారికి నిర్దిష్ట మొత్తంలో కార్బోహైడ్రేట్లు, అనారోగ్యకరమైన కొవ్వును తగ్గించడం అన్నది చాలా కీలకం. కార్బోహైడ్రేట్ లకు బదులుగా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. తద్వారా కండర ద్రవ్యరాశి పెరుగుతుంది. కొవ్వు తగ్గుతుంది. ఈ నేపధ్యంలో తక్కువ కొవ్వు ఆహారం, తక్కువ కార్బ్ ఆహారం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

READ ALSO : Weight Loss : బరువు తగ్గడానికి 5 సూపర్ ఇండియన్ ఫుడ్ కాంబోస్ !

తక్కువ కొవ్వు vs తక్కువ కార్బ్ ;

1. స్వల్పకాలానికి ప్రభావవంతంగా ఉంటుంది : డైటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తే పిండి పదార్థాలు, కొవ్వును నివారించడం ద్వారా కేలరీలను తగ్గించవచ్చు. దీంతో క్యాలరీ వినియోగం తగ్గుతుంది. ఇది కేలరీల లోటుకు దారితీస్తుంది. అందువల్ల బరువు తగ్గుతారు. పిండి పదార్థాలు నీటి బరువును కలిగి ఉన్నందున తక్కువ కార్బ్ ఆహారం మంచి అనుభూతిని కలిగిస్తుంది. బరువు కోల్పోయేలా చేస్తుంది.

2. అధిక పరిమితులు మంచిదికాదా : నియంత్రిత ఆహారం ఎక్కువకాలం పాటు స్థిరంగా కొనసాగించలేరు. ఆహారం నిలకడగా లేకపోతే దానితో పాటు బరువు నియంత్రణలో ఉంచటం సాధ్యపడదు. అనుకున్న లక్ష్యం నెరవేరదు.

READ ALSO : Benefits Of Niacinamide : జుట్టు ఆరోగ్యానికి నియాసినామైడ్ తో అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసా ?

3. వ్యక్తిగత ఆహార అలవాట్లు : ప్రతి వ్యక్తికి శరీరం అవసరాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శరీర పనితీరు ఉంటుంది. శరీర అవసరాలకు అనుగుణమైన ఆహారాలు తీసుకోవాలి. అనవసరమైన వాటికి దూరంగా ఉండాలి.

4. సరైన ఆహారం ; బరువు పెరుగుటకు కారణమయ్యే, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగించే అనారోగ్యకరమైన వాటిని నివారించాలి. వాటి స్ధానంలో ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవడం వలన ప్రయోజనకరంగా ఉంటుంది.

READ ALSO : Jaggery and Lemon Water : నిమ్మరసంలో బెల్లం కలిపి తీసుకుంటే బరువు త్వరగా తగ్గొచ్చు తెలుసా?

వివిధ రకాల పిండి పదార్థాలు, కొవ్వులు విభిన్న ప్రభావాలను కలిగి ఉంటాయి. అన్ని పిండి పదార్థాలు , కొవ్వులు శరీరాన్ని ఒకే విధంగా ప్రభావితం చేయవు. కొన్ని ఆహారాలలో కార్బోహైడ్రేట్లు కొందరిలో భిన్నమైన ప్రభావాన్ని చూపుతాయి. అదేవిధంగా, కొవ్వులతో, అసంతృప్త కొవ్వులు ధమనులను దెబ్బతీస్తాయి. సంతృప్త కొవ్వులు శరీరంపై విరుద్ధంగా పనిచేస్తాయి.

ట్రెండింగ్ వార్తలు