Benefits Of Niacinamide : జుట్టు ఆరోగ్యానికి నియాసినామైడ్ తో అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసా ?

విటమిన్ B3 శక్తిని అందించడంతోపాటు, ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. వెంట్రుకల కుదుళ్లకు ఆక్సిజన్ , పోషకాలను అందజేస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. జుట్టు ఆకృతిని, మెరుపు, మృదుత్వాన్ని ఇస్తుంది.

Benefits Of Niacinamide : జుట్టు రాలడం, జుట్టు పల్చబడడం, జుట్టు దెబ్బతినడం వంటి వాటితో చాలా మంది బాధపడుతుంటారు. ఈ సమస్యల నుండి బయటపడేందుకు మార్కెట్లో లభించే అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అలాంటి వారు రోజువారిగా తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జుట్టుకు మేలు చేసే నియాసినామైడ్ ఇది విటమిన్ B3 రకం. తలలో మంటను నివారించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, జుట్టు ఆరోగ్యానికి ముఖ్యమైన ప్రొటీన్ అయిన కెరాటిన్ ఉత్పత్తిలో సహాయపడటం ద్వారా జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

READ ALSO : Hair health : జుట్టు బలహీనంగా ఉందా? ఆలోచించాల్సిందే !

మాంసం, పాలు, చేపలు, గుడ్లు, ఆకుపచ్చ కూరగాయలు మరియు తృణధాన్యాలు వంటి ఆహారాలలో నియాసినామైడ్ ఉంటుంది. ఇది జుట్టు సంరక్షణ ఉత్పత్తుల ద్వారా కూడా పొందవచ్చు. ఈ విటమిన్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకోవటం ద్వారా పొందటం ఉత్తమమైన మార్గం.

మన జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నియాసినామైడ్ విటమిన్ B3 జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుంది. దీనిని నికోటినామైడ్ అని కూడా పిలుస్తారు, ఈ విటమిన్ నీటిలో కరిగుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం, ప్రోటీన్లను జీవక్రియ చేయడం వంటి అనేక విధుల్లో సహాయపడుతుంది. లిపిడ్లు, సెల్యులార్ శక్తిని మెరుగుపరుస్తాయి. శరీరానికి ఉపయోగపడే కార్బోహైడ్రేట్‌ను సంశ్లేషణ చేస్తాయి. ఇది శరీరంలో సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

నియాసినామైడ్ అనేది నీటిలో కరిగే విటమిన్ కావటంతో ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వెంట్రుకల కుదుళ్లకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఫలితంగా జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టుకు మెరుపుదనాన్ని, బలాన్ని ఇచ్చి కాపాడుతుంది. తేమను సమతుల్యం చేయడం, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రారంభించే రక్షిత పొరను సృష్టించడం ద్వారా ఆరోగ్యకరమైన జట్టుకు సహాయపడుతుంది. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదం చేస్తుంది.

READ ALSO : Prevent Hair Loss : జుట్టు రాలడాన్ని నివారించటంతోపాటు జుట్టుకు పోషణనిచ్చే సూపర్ ఫుడ్స్ !

నియాసినామైడ్ యొక్క ప్రయోజనాలు

1. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: విటమిన్ B3 శక్తిని అందించడంతోపాటు, ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. వెంట్రుకల కుదుళ్లకు ఆక్సిజన్ , పోషకాలను అందజేస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. జుట్టు ఆకృతిని, మెరుపు, మృదుత్వాన్ని ఇస్తుంది. ఈ విటమిన్ రసాయనికంగా దెబ్బతిన్న జుట్టుకు తిరిగి ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడుతుంది.

2. కెరాటిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది: కెరాటిన్ అనేది సహజమైన ప్రోటీన్, ఇది మన జుట్టుకు 90% కెరాటిన్ ఉంటుంది. నియాసినామైడ్ ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతుంది.కెరాటిన్ యొక్క అధిక స్థాయికి దారి తీస్తుంది, జుట్టు చిట్లటం వంటి సమస్యలను తొలగించి ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తుంది.

READ ALSO : coloring hair during pregnancy : గర్భధారణ సమయంలో జుట్టుకు రంగు వేయడం వల్ల పుట్టబోయే బిడ్డపై ప్రభావం పడుతుందా ?

3. స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది: పురుషులు, స్త్రీలలో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఇన్ఫ్లమేషన్ ఒకటి. నియాసినామైడ్ జుట్టు కుదుళ్ళలో మంటను తగ్గిస్తుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా, నిండుగా మారేలా చేస్తుంది.

4. జుట్టు మందంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది: తగ్గిన ఆక్సిడేట్ ఒత్తిడి కారణంగా నికోటినామైడ్‌తో జుట్టు మెరుగుపడుతుంది. జుట్టు యొక్క ఆకృతిని, మందాన్ని మెరుగుపరుస్తుంది.

5. పర్యావరణకారకాల నుండి జుట్టును రక్షిస్తుంది: నియాసినామైడ్ అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండి, UV కిరణాల నుండి జుట్టును రక్షిస్తుంది. కాలుష్యం, వేడి మొదలైనవాటి నుండి జుట్టు దెబ్బతినటాన్ని నివారిస్తుంది. మొత్తానికి జుట్టును ఆరోగ్యంగా ఉంచటంలో దీని పాత్ర క్రియాశీలకమనే చెప్పవచ్చు.

ట్రెండింగ్ వార్తలు