Covid Booster Shot : మీరు కొవిడ్ బూస్టర్ షాట్ ఇంకా తీసుకోలేదా? బూస్టర్ వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Covid Booster Shot : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదు.. ప్రపంచ దేశాల్లో మళ్లీ కొవిడ్ వేరియంట్ విజృంభిస్తోంది. ప్రస్తుతం చైనాలో ఈ కొత్త కొవిడ్ వేరియంట్- BF.7 వేగంగా వ్యాపిస్తోంది.

Covid Booster Shot : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదు.. ప్రపంచ దేశాల్లో మళ్లీ కొవిడ్ వేరియంట్ విజృంభిస్తోంది. ప్రస్తుతం చైనాలో ఈ కొత్త కొవిడ్ వేరియంట్- BF.7 వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో ప్రతిరోజూ 10 లక్షల కోవిడ్ కేసులు, 5వేల మరణాలు నమోదయ్యే అవకాశం ఉంది. గత కోవిడ్ వేవ్‌తో పోలిస్తే.. ఈ వేరియంట్ అతిపెద్ద వ్యాప్తి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చైనాలో కొవిడ్ వేరియంట్- BF.7తో పోరాడుతున్న వేళ.. భారత్‌లో కూడా రెడ్ అలర్ట్‌ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరినీ స్కాన్ చేస్తున్నారు. మరోవైపు.. దేశంలోని నివాసితులంతా కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకోవాలని ప్రభుత్వం అభ్యర్థిస్తోంది. ఈ బూస్టర్ డోసు తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడటానికి సిద్ధంగా ఉంటుంది.

కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ మోతాదు ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే కొవిడ్ వ్యాక్సిన్ మొదటి రెండు షాట్ల తర్వాత కాలక్రమేణా టీకా తీవ్రత తగ్గుతుంది. అందుకే బూస్టర్ డోసు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. తీవ్రమైన కరోనావైరస్ నుంచి రక్షణ పొందాలంటే రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. అయితే, మీరు ఇప్పటికీ బూస్టర్ షాట్ తీసుకోలేదా? అయితే, వెంటనే బూస్టర్ డోసు తీసుకోండి. ఇప్పటికే చైనా నుంచి మొదలై జపాన్, స్పెయిన్, అర్జెంటీనా అనేక ఇతర దేశాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Read Also : Covid Variant BF.7 : మాస్కులు మస్ట్, బూస్టర్ డోస్ తీసుకోవాలి- కరోనా కొత్త వేరియంట్‌పై కేంద్రం హెచ్చరిక

ఇలాంటి సందర్బాల్లో బూస్టర్ డోసు తీసుకోవడం చాలా మంచిది. పక్క దేశాల్లో విజృంభిస్తున్నBF.7 కొవిడ్ వేరియంట్ ఏ క్షణమైనా భారత్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే దేశంలో ఈ తరహా కొవిడ్ కేసులు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా ప్రతిఒక్కరూ కొవిడ్ బూస్టర్ డోసు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ బూస్టర్ డోసు ఎలా తీసుకోవాలి? ఎక్కడ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Covid Booster Shot _  how to book booster vaccine appointment Online

ఏ బూస్టర్ డోస్ ఎలా పొందాలంటే? :
బూస్టర్ డోస్ అనేది మీరు తీసుకున్న వ్యాక్సిన్‌కు మూడవ డోస్. ఉదాహరణకు.. మీరు COVAXIN వ్యాక్సిన్ లేదా కోవిషీల్డ్ డోసు రెండు తీసుకుంటే.. మీరు అదే వ్యాక్సిన్ బ్రాండ్ నుంచి బూస్టర్ డోసును తీసుకోవాలి.

కోవిడ్ బూస్టర్ డోస్ ఎక్కడ అందుబాటులో ఉందంటే? :
మీరు ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ టీకా కేంద్రంలో బూస్టర్ మోతాదు తీసుకోవచ్చు. ముఖ్యంగా, మీరు మొదటి, రెండవ డోస్ రెండింటి వివరాలను కలిగిన మీ టీకా ధృవీకరణ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి. దేశ పౌరులు తుది టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలి (రెండు మునుపటి మోతాదుల వివరాలతో). మునుపటి డోస్‌లకు ఉపయోగించిన మొబైల్ నంబర్, ID కార్డ్‌నే ఉపయోగించాలని గుర్తించుకోవాలి. ప్రభుత్వ టీకా కేంద్రాలలో ఉచిత టీకాను పొందవచ్చు. లేదంటే ఏదైనా CVC వద్ద డోస్ టీకాను పొందవచ్చు. COWIN వెబ్‌సైట్‌లో బూస్టర్ డోసుకు సంబంధించి వివరాలను పొందవచ్చు.

కోవిడ్-19 బూస్టర్ డోస్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలి :
* మీరు CoWIN వెబ్‌సైట్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా మీ బూస్టర్ వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
* CoWIN నుండి టీకా బుక్ చేసుకోవడానికి, ఏదైనా వెబ్ బ్రౌజర్‌లో అధికారిక పోర్టల్‌ని ఓపెన్ చేయండి.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి వెబ్‌సైట్‌లోకి Login అవ్వండి.
* మీరు మీ మొదటి రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకునేటప్పుడు రిజిస్టర్ అయిన అదే మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేయాలి.
* మీరు CoWIN వెబ్‌సైట్‌లో మీ మునుపటి అన్ని డోసుల టీకా ధృవీకరణను కనుగొనగలరు.
* మీరు భవిష్యత్తులో ఉపయోగం కోసం.. వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఇప్పుడు బూస్టర్ డోస్‌ను బుక్ చేసుకోవాలంటే.. మీరు అదే డోస్‌కు అర్హులు కాదో ఫస్ట్ చెక్ చేసుకోండి.
* రెండవ డోస్ తర్వాత 9 నెలల తర్వాత మాత్రమే బూస్టర్ షాట్ తీసుకోవచ్చు.
* మీరు CoWIN పోర్టల్‌లో మీ డోసు గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది.
* మీరు బూస్టర్ షాట్‌కు అర్హులైతే.. నోటిఫికేషన్ పక్కన అందుబాటులో ఉన్న షెడ్యూల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* అందుబాటులో ఉన్న టీకా సెంటర్లను కనుగొనడానికి Pincode లేదా జిల్లా పేరును నమోదు చేయండి.
* ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకా కేంద్రాన్ని చెక్ చేయండి.
* డేట్, టైమ్ ఎప్పుడు అనేది ఎంచుకుని అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.
* మీరు ప్రైవేట్ కేంద్రాల నుంచి అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకుంటే, మీరు డోస్ కోసం పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Covid-19: చైనాలో పెరుగుతున్న కోవిడ్.. ఇండియాకు ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందా?

ట్రెండింగ్ వార్తలు