Tiger Nuts : డయాబెటిస్ నియంత్రణలో ఉంచే టైగర్ నట్స్ !

టైగర్ నట్స్ లో కరిగని ఫైబర్ అధికం. దీనిలోని పీచు పదార్థం మలవిసర్జన సక్రమంగా జరిగేలా చేసి గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యని నివారించటంతోపాటు ఇందులో లైపీస్, అమైలెస్ వంటి ఎంజైమ్ లు పేగుల్లోని ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో సహాయపడతాయి.

diabetes

Tiger Nuts : చూడటానికి శనగాల్లా కనిపించే టైగర్ నట్స్ ను ఆహారంగా తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. టైగర్ నట్స్ ను ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు. చుఫా గింజలు, ఎల్లో నట్స్ ఎడ్జ్, ఎర్త్ ఆల్మండ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. కొంచెం తీపి, వగరు, కొబ్బరి రుచిని కలిగి ఉండే వీటిని పూర్వం రోజుల్లో ఎక్కువగా ఆహారంగా తీసుకునేవారు.

READ ALSO : Boys saved the dog : కుక్కను కాపాడటానికి ప్రాణాలకు తెగించిన చిన్నారులు .. బంగారాలంటూ నెటిజన్లు ప్రశంసలు

ఇటీవలి కాలంలో మళ్ళీ టైగర్ నట్స్ ను ఆహారంలో బాగం చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ టైగర్ నట్స్ పొడిని పాలలో కలుపుకుని తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి నమలడానికి కాస్త గట్టిగా ఉండటమే కారణం. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Jagapthi Babu : వందల కోట్ల ఆస్తి జగపతి బాబు ఎలా పోగొట్టుకున్నాడు? సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంత సంపాదించాడు?

టైగర్ నట్స్ తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ;

టైగర్ నట్స్ లో కరిగని ఫైబర్ అధికం. దీనిలోని పీచు పదార్థం మలవిసర్జన సక్రమంగా జరిగేలా చేసి గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యని నివారించటంతోపాటు ఇందులో లైపీస్, అమైలెస్ వంటి ఎంజైమ్ లు పేగుల్లోని ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో సహాయపడతాయి. గ్యాస్, పొట్ట ఉబ్బడం, అజీర్తి, అతిసారం వంటి సమస్యలతో బాధపడేవారు టైగర్ నట్స్ ను తీసుకోవటం వల్ల ఉపశమనం పొందవచ్చు.

READ ALSO : pet parrots Missing : తప్పిపోయిన చిలుకను తెచ్చిస్తే రూ. 10 వేల బహుమతి

దీనిలో మధుమేహాన్ని నియంత్రించగలిగే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఉండే అమినో యాసిడ్ ఆర్జినైన్ అధిక మొత్తంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చూస్తుంది. అంతేకాకుండా కరగని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ స్ధాయిలని పెంచటంలో సహాయపడతాయి.

READ ALSO : Zomato : డ్రోన్లతో జొమాటో ఆర్డర్ల డెలివరీ .. బోయ్ చేసిన వినూత్న ఆలోచన

టైగర్ నట్స్ లో అసిటోన్, ఇథనాల్, క్లోరోఫామ్, పెట్రోలియం ఈథర్ వంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇకోలి, సాల్మొనెల్లా, సెయింట్ ఆరియస్ కి వ్యతిరేకంగా పని చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి జీర్ణవ్యవస్థని రక్షించుకోవడం కోసం యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే టైగర్ నట్స్ ను ఆహారంలో చేర్చుకోవటం మంచిది. వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో ఉపయోగపతాయి. చెడు బ్యాకర్టీయాతో పోరాడటం ద్వారా జీర్ణ వ్యవస్థ సజావుగా సాగేలా చేస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు