Boys saved the dog : కుక్కను కాపాడటానికి ప్రాణాలకు తెగించిన చిన్నారులు .. బంగారాలంటూ నెటిజన్లు ప్రశంసలు

ప్రాణాపాయంలో ఉన్న ఓ శునకాన్ని చూడగానే ఇద్దరు చిన్నారుల మనసు చలించిపోయింది. భారీగా ప్రవహిస్తున్న మురుగు కాల్వలోకి దిగి శునకం ప్రాణాలు కాపాడారు. వారి సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Boys saved the dog

Boys saved the dog : భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక చోట్ల ఇళ్లు మునిగిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లు తెగిపోయాయి. ఇక వరదనీటిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన మూగజీవాల గురించి చెప్పనలవి కాదు. తాజాగా భారీ నీటితో ప్రవహిస్తున్న మురుగుకాల్వ వద్ద  ఓ శునకం చిక్కుకుంది. ఇద్దరు చిన్నారులు ప్రాణాలకు తెగించి ఆ శునకాన్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mumbai : కుక్కల మెడలో QR కోడ్ .. తప్పిపోయిన డాగ్స్ ట్రాక్ చేయడానికి క్రియేట్ చేసిన ఇంజనీర్

వర్షాలు, వరదల కారణంగా వీధుల్లో తిరిగే శునకాలకు రక్షణ లేకుండా పోయింది. కొన్ని వరద నీటిలో కొట్టుకుని పోగా.. కొన్నిటిని జనం కాపాడారు. ఎలా వెళ్లిందో ఏమో.. ఓ శునకం వేగంగా ప్రవహిస్తున్న ఓ మురుగునీటి కాల్వ అవతలి గట్టు వైపు చిక్కుకుపోయింది. ఇవతలివైపుకు రావడానికి ఆసరా దొరక్క బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. అటువైపుగా వెళ్తున్న ఇద్దరు చిన్నారులు ఆ శునకాన్ని కాపాడాటానికి సాహసం చేశారు.

Worlds Ugliest Dog 2023 : ప్రపంచంలోనే అంద వికారమైన శునకంగా గెలుపొందిన ‘స్కూటర్’ అనే డాగ్

పిల్లలు సాధారణంగా కుక్కల్ని చూసి భయపడతారు. ఈ చిన్నారులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మురుగు కాల్వలోకి దిగి అవతలివైపుకి వెళ్లారు. భయంగా తమవైపు చూస్తున్న శునకాన్ని ప్రేమగా నిమిరి దగ్గరకు తీసుకుని ఎత్తుకుని ఇవతలి వైపుకు తీసుకువచ్చారు. ఆ శునకం ప్రాణాలు కాపాడారు. arya_vamshi17 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్  ‘సూపర్ హీరోలు.. మూగజీవాల పట్ల ఎలా ప్రవర్తించాలో ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి’ అనే ట్యాగ్‌తో వీడియో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు చిన్నారుల్ని ‘బంగారాలని..తాము ప్రమాదంలో పడతామనే ఆలోచన లేకుండా కుక్క ప్రాణాలు కాపాడారని.. వారికి బహుమతి ఇవ్వండి.. ‘ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు