COVID-19 Recovery: కొవిడ్ నుంచి కోలుకున్న 116ఏళ్ల మహిళ

ప్రాణాంతక వైరస్ కొవిడ్ మహమ్మారి.. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకూ లక్షల సంఖ్యలో పొట్టనబెట్టుకుంది. యువకులు కూడా మహమ్మారి ధాటికి...

COVID-19 Recovery: ప్రాణాంతక వైరస్ కొవిడ్ మహమ్మారి.. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకూ లక్షల సంఖ్యలో పొట్టనబెట్టుకుంది. యువకులు కూడా మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఓ అద్భుతం జరిగింది. శరీర కండరాల్లో, అంతర్గత వ్యవస్థలో సత్తువ కోల్పోయిన వయస్సులో ఓ వృద్ధురాలు కొవిడ్-19తో పోరాడి బయటపడింది.

తన తల్లి బతకాలని ఎదురుచూసిన ఆ కొడుకు కోరిక ఫలించింది. Ayse Karatay అనే వృద్ధురాలిని ప్రస్తుతం ఐసీయూ నుంచి నార్మల్ వార్డ్ కు తరలించారని ఆమె కొడుకు ఇబ్రహీం శనివారం మీడియాతో అన్నారు.

‘నా తల్లి 116ఏళ్ల వయస్సులో కొవిడ్ కారణంగా అనారోగ్యానికి గురైంది. మూడు వారాలుగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఆమె ఆరోగ్యం ఇప్పుడు మెరుగైంది. కాస్త కుదుటపడటంతో అక్కడి నుంచి నార్మల్ వార్డ్ కు మార్చారు’ అని ఇబ్రహీం అన్నారు.

తన తల్లికి ఇలా వైరస్ ఇన్ఫెక్షన్ సోకడానికి ముందు ఆమె చైనాకు చెందిన సినోవాక్ వ్యాక్సిన్ ఒక డోస్ మాత్రమే తీసుకుందని అన్నారు.

ఇలా గతంలోనూ జరిగింది. 117ఏళ్ల ఫ్రెంచ్ నర్సు ఒకరు ఫిబ్రవరిలో తన పుట్టిన రోజు కంటే ఒకరోజు ముందే కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఆమె ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వయస్కురాలని రికార్డులు చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు