58 Foot Bridge Theft : వామ్మో..58 అడుగుల బ్రిడ్జినే ఎత్తుకుపోయిన దొంగలు..షాక్ అయిన పోలీసులు

దొంగలు ఏకంగా 58 అడుగుల బ్రిడ్జినే ఎత్తుకుపోయారు. ఈ వింత చోరీ గురించి విన్న పోలీసులు షాక్ అయ్యారు.

58-foot bridge missing : దొంగలు ఎవరైనా డబ్బులు, నగలు, విలువైన వస్తువులు దోచుకుపోతారు. కొంటె దొంగలైతే దోపిడీకొచ్చిన ఇంట్లో అన్నం కూరలు లాగించేసి మరీ పోతారు. కానీ ఒహియాలో దొంగలు ఏం దొంగిలించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏం ఎత్తుకుపోయారో తెలుసా?..ఏకంగా ఓ భారీ ‘వంతెన‘ను ఎత్తుకుపోయారు? మీరు విన్నది నిజమే. దొంగలు ఓ బ్రిడ్జీని ఎత్తుకుపోయారు. అదికూడా 58 అడుగుల పొడవైన బ్రిడ్జీని ఎత్తుకుపోయారు. వీళ్లేంట్రే బాబు .. ఏకంగా వంతెనే ఎత్తుకెళ్లిపోయారు’’ అంటూ పోలీసులు కూడా షాక్ అవుతున్నారు సరదు దొంగల పనితనానికి. ‘ మా సర్వీలో ఇటువంటి దొంగతనం చూడలేదురా బాబూ’అంటున్నారు.

ఒహియాలోని స్మాల్ అక్రాన్ ప్రాంతంలో రాత్రికి రాత్రి 58 అడుగుల పొడవైన ఫుట్ బ్రిడ్జి మాయమైపోయింది. పోనీ.. వరదలు వచ్చి కొట్టుకుపోయిందా? అంటే అదేమీకాదఉ. ఎందుకంటే.. ఆ పరిసరాల్లో వర్షాలు కురవనేలేదు. కానీ ఈస్ట్ ఆక్రోన్‌లోని ఓ కాలువపై నిర్మించిన పాలీమర్‌తో నిర్మించిన వంతెన మాత్రం మాయం అయిపోయింది.

Read more :  వంతెనను వదల్లేదు : ఢిల్లీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీ చోరీ!

నవంబరు 3న ఆ వంతెనకు ఉన్న డెక్‌ను కనిపించకపోవటంతో ఆ సమీపంలోని గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఏంటీ వంతెన కనిపించకపోవటమేంటీ అంటూ పలువురు గ్రామస్తులు అక్కడకు వచ్చి పరిశీలించారు. కానీ వంతెన జాడే లేదు. గత వారం రోజుల క్రితం ఉన్న వంతెన సడెన్ గా మాయం అయ్యేసరికి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్థులు చెప్పినమాటలు విన్న పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఏంటీ బ్రిడ్జ్ కనిపించట్లేదా? అని మరోసారి అడిగారు.మళ్లీ గ్రామస్తులు అదే మాట చెప్పటంతో ఘటనాస్థలానికి వచ్చి చూశారు. నిజమే ఫుట్ బ్రిడ్జ్ ఉన్న ఆనవాళ్లు ఉన్నాయి గానీ వంతెన మాత్రం లేదు. భారీ క్రేన్లతో నిర్మించిన వంతెన మాయం కావటంతో పోలీసులు షాక్ అయ్యారు.

10 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తు, 58 అడుగుల పొడవు ఉండే ఆ వంతెన తొలగించాలంటే.. భారీ క్రేన్లు అవసరమవుతాయి. అటువంటిది దొంగలు గుట్టుచప్పుడు కాకుండా.. కనీసం గట్టిగా కేక వేస్తే గ్రామస్తుల ఇళ్లలోకి వినిపించేంత దూరంలో ఉన్న గ్రామస్తులకు కూడా అనుమానం రాకుండా ఆ వంతెనను ఎలా దొంగిలించారనేది పోలీసులకు పిచ్చెక్కిస్తోంది. బాహుశా.. వారు వంతెనను ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అలా చేయాలన్నా కష్టమే. కానీ సదరు దొంగలు ఎవరో గానీ చేసి చూపించారుగా అనుకున్నారు పోలీసులు.

Read more : Wuhan lab Covid-19:క‌రోనా వైరస్ పుట్టింది ఉహాన్ ల్యాబ్‌లోనే..పార్ల‌మెంట్ కు తెలిపిన కెన‌డా శాస్త్ర‌వేత్త‌ డా.అలీనా చాన్

ఈ వంతెన చోరీపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ..నా 22 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ ఇటువంటి దొంగతనాన్ని చూడలేదు..కనీసం వినను కూడా వినలదేని తెలిపారు. ఈ వింత చోరీ పోలీసు చరిత్రలో మిస్టరీగా కేసుగా నిలిచిపోతుందని..కానీ ఈ కేసును ఛేదించకుండా అలా వదిలేది లేదని స్పష్టం చేశారు. వంతెన చోరీగాళ్లను పట్టుకుని తీరతామని ధీమా వ్యక్తంచేశారు. ఆ వంతెన విలువ సుమారు 40 వేల డాలర్లు (రూ.30.44 లక్షలు) ఉంటుందని తెలిపారు.

కాగా ట్విస్ట్ ఏమిటంటే.. అది పాలిమర్‌తో తయారు చేసిన వంతెన. దాన్ని అమ్మినా డబ్బులు రావు. పైగా రీసైక్లింగ్ చేసి మళ్లీ ఉపయోగించడం కూడా సాధ్యం కాదు. మరి దాన్ని ఎత్తుకెళ్లిన దొంగలకు ఈ విషయం తెలుసో.. లేదో!! అంత భారీ బ్రిడ్జ్ ని అత్యంత లాఘవంగా ఎత్తుకుపోయిన దొంగలకు ఈ విషయం తెలుసో లేదో..మరి తెలిసే ఎత్తుకుపోయారా? తెలిస్తే చేస్తే ఏం చేసుకుంటారు? అనేది పెద్ద ప్రశ్న..మరి ఈ చోరీ కేసు ఛేదించాక అసలు విషయం తేలనుంది.

ట్రెండింగ్ వార్తలు