Titan submarine: టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం.. ఐదుగురు మరణించి ఉండవచ్చని ఓషన్‌గేట్ ప్రకటన

టైటానిక్ సాహస ప్రయాణంలో టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం అయింది. సముద్రంలో జాడ లేకుండా పోయిన టైటాన్ మినీ జలాంతర్గామీలో ఉన్న ఐదుగురు మరణించి ఉంటారని ఓషన్ గేట్ సంస్థ ప్రకటించింది....

Titan submarine: టైటానిక్ సాహస ప్రయాణంలో టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం అయింది. సముద్రంలో జాడ లేకుండా పోయిన టైటాన్ మినీ జలాంతర్గామీలో ఉన్న ఐదుగురు మరణించి ఉంటారని ఓషన్ గేట్ సంస్థ ప్రకటించింది. టైటానిక్ (Titanic) సందర్శనకు వెళ్లిన ఐదుగురు సాహస అన్వేషకులు మరణించడం విషాదాన్ని మిగిల్చింది. ప్రపంచంలో మహా సముద్రాలను అన్వేషించే అభిరుచి ఉన్న ఐదుగురు సాహస యాత్రికులు మరణించడం తమ హృదయాలను కలిచివేసిందని టైటాన్ మినీ జలాంతర్గామి సంస్థ ఓషన్ గేట్ (OceanGate) పేర్కొంది. సముద్ర గర్భంలో టైటానిక్ శిధిలాల సమీపంలో టైటాన్ మినీ జలాంతర్గామి శిధిలాలు కనిపించాయని యూఎస్ కోస్ట్ గార్డ్స్ ప్రకటించింది.

PM Modi In US Congress:ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు భారత్ నిలయం..యూఎస్ కాంగ్రెస్ సమావేశంలో మోదీ వ్యాఖ్యలు

మానవ రహిత కెనడియన్ ఓడ శిధిలాలను కనుగొందని యూఎస్ కోస్ట్ గార్డ్ ట్వీట్ చేసింది. జాడ లేకుండా పోయిన టైటాన్ సబ్ మెర్సిబుల్ ఆచూకీ కోసం పలు దేశాల నుంచి రెస్క్యూ బృందాలు వేల చదరపు మైళ్ల బహిరంగ సముద్రాల్లో విమానాలు, నౌకలతో రోజుల తరబడి శోధించాయి. సబ్‌మెర్సిబుల్ ఆదివారం ఉదయం దాని సపోర్ట్ షిప్‌తో ఒక గంట 45 నిమిషాలకు సంబంధాన్ని కోల్పోయింది.

Titan submersible: మునిగిన టైటానిక్ సబ్‌మెర్సిబుల్‌ను వెలికితీయడంలో సవాళ్లెన్నో

గల్లంతైన జలాంతర్గామీలో ఉన్న ఐదుగురు వ్యక్తులు బ్రిటిష్ బిలియనీర్, అన్వేషకుడు హమీష్ హార్డింగ్, (58) పాకిస్థాన్‌లో జన్మించిన వ్యాపారవేత్త షాజాదా దావూద్(48) అతని 19 ఏళ్ల కుమారుడు (సులేమాన్) ఫ్రెంచ్ సముద్ర శాస్త్రవేత్త, టైటానిక్ నిపుణుడు పాల్-హెన్రీ నార్గోలెట్(77), సబ్‌మెర్సిబుల్‌ పైలట్, ఓషన్‌గేట్ అమెరికన్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్‌టన్ రష్ లు మరణించి ఉంటారని ఓషన్ గేట్ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు