Russia Revolt: ప్రిగోజిన్ ప్లాన్‌ను అమెరికా నిఘా సంస్థలు ముందుగానే పసిగట్టాయట.. పుతిన్‌కు ఎప్పుడు తెలిసిందంటే?

ప్రిగోజిన్ రష్యా రక్షణ శాఖకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని, రష్యాలో ఉద్రిక్తతలు చోటుచేసుకోనున్నాయని అమెరికా నిఘా సంస్థలు ముందే పసిగట్టాయట.

Wagner Group: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. సుమారు 24గంటలపాటు ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కీలకమైన రొస్తోవ్ నగరాన్ని గంటల వ్యవధిలోనే వాగ్నర్ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ తరువాత మాస్కో దిశగా పయణించాయి. ఈ క్రమంలో రష్యన్ సైనికులు మాస్కో సరిహద్దుల్లో వాగ్నర్ సేనలను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం అయ్యారు. మాస్కోపై మరికొద్ది గంటల్లో వాగ్నర్ సేన విరుచుకుపడుతుందని అందరూ భావించారు. అయితే, ఉన్నట్లుండి వాగ్నర్ గ్రూప్ వెనక్కి తగ్గింది. దీంతో రష్యాలో అంతర్యుద్దం ముప్పు తప్పినట్లయింది.

Wagner Group: మాకు వెన్నుపోటు పొడిచారు, వారికి చుక్కలు చూపిస్తాం.. రష్యా సైన్యంపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపుకు పుతిన్ వార్నింగ్

రష్యాలో తిరుగుబాటు జరుగుతుందని అమెరికా నిఘా సంస్థలు ముందుగానే పసిగట్టాయట. ప్రిగోజిన్ రష్యా రక్షణ శాఖకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని, అణుశక్తి దేశమైన రష్యాలో ఉద్రిక్తతలు చోటుచేసుకోనున్నాయని ఒకరోజు ముందే అమెరికా నిఘా సంస్థలు శ్వేత సౌధం, పెంటగాన్‌కు నివేదికలు సమర్పించాయని అమెరికా వార్త సంస్థలు శనివారం తెలిపాయి. ప్రిగోజిన్ కొద్ది నెలలుగా ఈ వ్యవహారంపై ప్లాన్ వేస్తున్నాడట. అమెరికా నిఘా సంస్థలకు అతని ప్లాన్ సమాచారం ఉన్నా స్పష్టత లభించలేదు. వారం రోజులు ముందు ప్రిగోజిన్ తిరుగుబాటుకు సిద్ధమవుతున్నాడని అమెరికా నిఘా సంస్థలకు స్పష్టమైన సమాచారం వచ్చిందని అమెరికాలోని వార్త సంస్థలు తెలిపాయి.

Russia : ప్రిగోజిన్‌తో ఏ ఒప్పందం రష్యాపై తిరుగుబాటును ఆపింది.. పుతిన్ మాస్కో నుండి నిజంగానే పారిపోయాడా?

నమ్మిన బంటు ప్రిగోజిన్ తిరుగుబాటు గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా ముందే తెలుసని అమెరికా మీడియా పేర్కొంది. అయితే, పుతిన్‌కు ఒక్కరోజు ముందే తెలుసని అమెరికా మీడియా తెలిపింది. మాస్కో వైపు దూసుకెళ్తున్న వాగ్నర్ గ్రూప్ సేనలు ఉన్నట్లుండి వెనక్కు వెళ్లిపోయాయి. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ స్నేహితుడు, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం వహించి వాగ్నర్ సేనలను కట్టడి చేశారు. ప్రిగోజిన్ పెట్టిన పలు డిమాండ్లకు ఒప్పుకోవటంతో వాగ్నర్ సేనలు వెనక్కు తగ్గినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే బెలారస్ మధ్యవర్తిత్వం వహించిన డీల్ పై పుతిన్ ఎటువంటి ప్రకటనా ఇప్పటి వరకు చేయలేదు.

ట్రెండింగ్ వార్తలు