Russia : ప్రిగోజిన్‌తో ఏ ఒప్పందం రష్యాపై తిరుగుబాటును ఆపింది.. పుతిన్ మాస్కో నుండి నిజంగానే పారిపోయాడా?

వాగ్నర్ సైన్యం మాస్కో వైపు దూసుకొచ్చే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కో నుంచి పారిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. పుతిన్ ఉపయోగించే అనేక విమానాల్లో ఒకటి మాస్కో నుండి బయలుదేరిందని ప్రచారం జరిగింది.

Wagner Group: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Russia President Putin)పై కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ (Wagner Group) తిరుగుబాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. సుమారు 24గంటలపాటు ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కీలకమైన రొస్తోవ్‌ నగరాన్ని తిరుగుబాటు వాగ్నర్ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ తరువాత మాస్కో దిశగా పయణించాయి. ఈ క్రమంలో రష్యన్ సైనికులు మాస్కో సరిహద్దుల్లో వాగ్నర్ సేనలను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం అయ్యారు. మాస్కోపై మరికొద్ది గంటల్లో వాగ్నర్ సేన విరుచుకుపడుతుందని అందరూ భావించారు. అయితే, ఉన్నట్లుండి వాగ్నర్ గ్రూప్ వెనక్కి తగ్గింది. తిరిగి ఉక్రెయిన్‍‌లోని యుద్ధ క్షేత్రాలకు వెళుతున్నట్లు గ్రూప్ అధిపతి యెవ్‌జెనీ ప్రిగోజిన్ ప్రకటించారు. రష్యన్ల రక్తపాతాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

Russia : మాస్కో మార్చ్ నిలిపివేత, వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌పై చర్యల ఉపసంహరణ

ప్రిగోజిన్‌ను ఆపడానికి మాస్కో అంగీకరించిన ఒప్పందం ఏమిటి?

రెండు గంటల వ్యవధిలోనే కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ రష్యాసైనంపై తిరుగుబాటుకు వెనక్కి తగ్గడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్నేహితుడు, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం వహించి వాగ్నర్ సేనలను కట్టడి చేశారు. ప్రిగోజిన్‌ పలు డిమాండ్లకు మాస్కో అంగీకరించినట్లు తెలిసింది. ముఖ్యంగా తిరుగుబాటు సమయంలో ప్రిగోజిన్ పై తెరవబడిన క్రినల్ కేసు తొలగించడంతో పాటు, వాగ్నర్ సైనలపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. వాగ్నర్ సేన తిరిగి తమ స్థావరాలకు వస్తుందని, పోరాట యోధులు తిరిగి రష్యా సైన్యంతో కలిసి పనిచేస్తారని పెస్కోవ్ పేర్కొన్నారు. వాగ్నర్ గ్రూప్ మాస్కో వెళ్లకుండా వెనక్కి తగ్గడంతో రష్యాలో అంతర్యుద్దం ముప్పు తప్పినట్లయింది. అయితే, వాగ్నర్ సేనలు ఉన్నట్లుండి వెనక్కి వెళ్లిపోవటానికి ఒప్పందం ఏమై ఉండవచ్చు అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రిగోజిన్ డిమాండ్లకు దాదాపుఅన్నింటికి మాస్కో అంగీకరించి ఉండవచ్చునని, ఆ కారణంగానే వాగ్నర్ సేనలు వెనక్కి వెళ్లిపోవటానికి కారణమై ఉంటుందని అంతర్జాయ మీడియా పేర్కొంది.

Mutiny in Russia: అప్పట్లో ఓ ఖైదీ.. ఇప్పుడు సొంత దేశ అధ్యక్షుడినే వణికిస్తున్న ప్రిగోజిన్.. ఇంత ధైర్యం ఎక్కడిది?

పుతిన్ మస్కో నుంచి పారిపోయాడా?

వాగ్నర్ సైన్యం మాస్కో వైపు దూసుకొచ్చే క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కో నుంచి పారిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. పుతిన్ ఉపయోగించే అనేక విమానాల్లో ఒకటి మాస్కో నుండి బయలుదేరిందని, అరగంటలోపే పుతిన్ అధికారిక నివాసానికి 150 కిలో మీటర్ల దూరంలో అది రాడార్ నుండి బయటపడిందని నివేదికలు తెలిపాయి. అయితే, పుతిన్ మాస్కో నుండి సెయింట్ పీటర్స్ బర్గ్‌కు పారిపోయినట్లు వస్తున్న వార్తలను క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ ఖండించారు.

ట్రెండింగ్ వార్తలు