Russia : మాస్కో మార్చ్ నిలిపివేత, వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌పై చర్యల ఉపసంహరణ

బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ కిరాయి దళం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ తన దళాల మాస్కో మార్చ్‌ను నిలిపివేశారు.దీంతో రష్యా సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు ప్రిగోజిన్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని క్రెమ్లిన్ ప్రతినిధి ప్రకటించారు....

Russia : బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ కిరాయి దళం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ తన దళాల మాస్కో మార్చ్‌ను నిలిపివేశారు. రష్యా సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు ప్రిగోజిన్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని క్రెమ్లిన్ ప్రతినిధి ప్రకటించారు. (Russia drops charges against Wagner chief Prigozhin) వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ బెలారస్ దేశానికి వెళతారని, అతనితో కలిసి తిరుగుబాటు చేసిన కిరాయి గ్రూపు యోధులను చట్టం ప్రకారం ప్రాసిక్యూట్ చేయబోమని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి ఎస్ పెస్కోవ్ చెప్పారు. (after his forces halt march to Moscow)

Opposition Meet: తిరిగి తిరిగి కాంగ్రెస్ చెంతకే ప్రతిపక్షాలు.. పాట్నా మెగా మీటింగ్‭లో ఏం జరిగింది?

‘‘తిరుగుబాటులో పాల్గొనని వాగ్నర్ యోధులు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందాలపై సంతకం చేయవచ్చు’’ అని పెస్కోవ్‌ పేర్కొన్నారు. ఉద్రిక్తతలను తగ్గించే ఒప్పందం గురించి ప్రిగోజిన్ తో చర్చలు జరిపానని బెలారసియన్ అధ్యక్షుడు చెప్పారు. శనివారం రాత్రి 9 గంటల వరకు చర్చలు జరిపి, రష్యా అధ్యక్షుడితో మళ్లీ ఫోన్ ద్వారా మాట్లాడామని బెలారస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో రాశారు. బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకో వాగ్నర్ గ్రూప్ నాయకుడు ప్రిగోజిన్ తో జరిగిన చర్చల ఫలితాల గురించి రష్యా అధ్యక్షుడికి తెలిపారు. అధ్యక్షుడు పుతిన్ తాను చేసిన పనికి ధన్యవాదాలు తెలిపారని లుకాషెంకో చెప్పారు.

Vivo X90s Specifications : వివో X90s ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌పై అతని దళాలు మాస్కోకు మార్చ్‌ను నిలిపివేసిన తర్వాత రష్యా వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌పై అతని దళాలు మాస్కోకు మార్చ్‌ను నిలిపివేసిన తర్వాత అతనిపై ఆరోపణలను ఉపసంహరించుకుంది.సోషల్ మీడియాలో ప్రసారం అయిన వీడియోల ప్రకారం, వాగ్నర్ సాయుధ వాహనాలు శనివారం రాత్రి నైరుతి రష్యాలోని రోస్టోవ్-ఆన్-డాన్ సైనిక కేంద్రం నుంచి బయలుదేరాయి. ప్రిగోజిన్ తన బలగాలు దక్షిణ నగరమైన రోస్టోవ్-ఆన్-డాన్ నుంచి కూడా వెనుకడుగు వేస్తున్నాయో లేదో దాని గురించి ముందుగా ప్రస్థావించలేదు. రోస్టోవ్ ఆన్ డాన్ లోని సైనిక, పౌర భవనాలను వాగ్నర్ గ్రూప్ కిరాయి సైనికులు స్వాధీనం చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు