China military outposts in Pakistan: పాకిస్థాన్‌లో చైనా మిలటరీ ఔట్‌పోస్టులు?.. ప్రధాని షెహబాజ్‌తో చైనా కీలక చర్చలు

పాకిస్థాన్‌లో తమ ఆర్మీతో మిలటరీ ఔట్‌పోస్టులు ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీపీఈసీ ప్రాజెక్టుకు తాలిబన్ల పాలిత అఫ్గానిస్థాన్‌ నుంచి ముప్పు ఉందని చైనా-పాక్ భావిస్తున్నాయి. పాక్-అఫ్గాన్ సరిహద్దుల విషయంపై ఆ రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవలే సరిహద్దుల వద్ద పాలుసార్లు కాల్పులు చోటుచేసుకున్నాయి.

China military outposts in Pakistan: పాకిస్థాన్‌లో తమ ఆర్మీతో మిలటరీ ఔట్‌పోస్టులు ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీపీఈసీ ప్రాజెక్టుకు తాలిబన్ల పాలిత అఫ్గానిస్థాన్‌ నుంచి ముప్పు ఉందని చైనా-పాక్ భావిస్తున్నాయి. పాక్-అఫ్గాన్ సరిహద్దుల విషయంపై ఆ రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవలే సరిహద్దుల వద్ద పాలుసార్లు కాల్పులు చోటుచేసుకున్నాయి.

దీంతో, ఆ ప్రాంతంలో పాక్-చైనా ప్రయోజనాల దృష్ట్యా మిలటరీ ఔట్ పోస్టులు ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. ఈ మేరకు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావాల్ భుట్టో, ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో చైౌనా రాయబారి నాంగ్ రోంగ్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పాక్-అఫ్గాన్ మార్గం ద్వారా మధ్య ఆసియాలో తన ప్రాభవాన్ని పెంచుకోవాలని భావిస్తోన్న చైనా ఆ రెండు దేశాల్లో వ్యూహత్మక పెట్టుబడులు పెట్టింది.

పాక్ లో చైనా ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆర్థికంగానే కాకుండా మిలటరీ, దౌత్య పరంగానూ చైనాపై పాక్ ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో తమ మిలటరీ ఔట్ పోస్టులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని చైనా ఒత్తిడి తీసుకువస్తోంది. బెల్డ్ అండ్ రోడ్ ప్రాజెక్టు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగడానికి పాక్ తో పాటు అఫ్గాన్ లోనూ తమ మిలటరీ ఔట్ పోస్టులు ఏర్పాటు చేసుకుంటామని చైనా అధికారులు అంటున్నారు.

Lok Sabha Polls 2024: బిహార్‌లో 35 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ

ట్రెండింగ్ వార్తలు