Corona Virus: కరోనా వైరస్ ఆనవాళ్లు చెబితే.. రూ.11.5లక్షల బహుమతి ఇస్తామంటోన్న చైనా

కరోనావైరస్ పై ప్రపంచానికి కనిపించేలా యుద్ధాన్ని ప్రకటించింది చైనాలోని ఓ ప్రాంతం. ర‌ష్యాతో స‌రిహ‌ద్దుల్లో ఉన్న హీహే న‌గ‌రం తాజాగా ఓ ప్ర‌క‌ట‌న చేసింది.

Corona Virus: కరోనావైరస్ పై ప్రపంచానికి కనిపించేలా యుద్ధాన్ని ప్రకటించింది చైనాలోని ఓ ప్రాంతం. ర‌ష్యాతో స‌రిహ‌ద్దుల్లో ఉన్న హీహే న‌గ‌రం తాజాగా ఓ ప్ర‌క‌ట‌న చేసింది. కొత్త‌గా విజృంభిస్తున్న క‌రోనా వైర‌స్ ఆన‌వాళ్ల‌ను గుర్తించిన వారికి ల‌క్ష యువాన్లు(15వేల 500 డాల‌ర్లు) బహుమతిగా ఇస్తామ‌ని ఆ న‌గ‌రం ప్ర‌క‌టించింది.

వైర‌స్ ఎక్క‌డ నుంచి వ్యాపించింది.. ఆ వైర‌స్ ఇతరులకు సంక్రమిస్తున్న తీరుపై విశ్లేషణ జరిపే క్రమంలో స్థానిక ప్ర‌భుత్వం ఈ న‌జ‌రానాను ప్ర‌క‌టించింది. చైనాలో డెల్టా వేరియంట్‌కు చెందిన క‌రోనా కేసులు భారీగా న‌మోదవుతున్నాయి. అలా దేశ‌వ్యాప్తంగా మ‌ళ్లీ తీవ్ర స్థాయిలో ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించారు. ఆదివారం విడుదల చేసిన కీలక ప్ర‌క‌ట‌నలో ఈ విషయాలను వెల్లడించింది.

వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సాధార‌ణ ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని, ద‌ర్యాప్తుకు ఆధారాలు స‌మ‌ర్పించాల‌ని ప్ర‌క‌ట‌న‌లో కోరారు. అతి విలువైన స‌మాచారమిస్తే.. వైర‌స్ పుట్టుక గురించి తెలుస్తుంద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఉద్దేశ్యపూర్వకంగానే సమాచారాన్ని దాచిపెడితే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రికలు జారీ చేసింది.

……………………………………… : గర్భిణీల్లో విటమిన్ ఎ లోపిస్తే?

జంతువుల స్మ‌గ్లింగ్‌, అక్ర‌మ వేట‌, స‌రిహ‌ద్దుల్లో చేప‌ల వేట‌కు వెళ్ల‌డం లాంటివి ఎవ‌రైనా పాల్పడితే వెంటనే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా, అక్టోబ‌ర్ ఒక‌టి త‌ర్వాత ఆన్‌లైన్‌లో వ‌స్తువులు కొనుగోలు చేసిన వారు.. వ‌స్తువుల‌ను డిస్ఇన్‌ఫెక్ట్ చేయాల‌ని సూచించింది. వైర‌స్ టెస్టింగ్ కోసం కూడా ప్ర‌భుత్వ సెంట‌ర్‌కు పంపాల‌ని సూచించింది.

క‌రోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వ‌స్తువుల‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొద్దంటూ సూచనలు ఇచ్చింది. లాజిస్టిక్స్‌, కొరియ‌ర్ కంపెనీలు తగు జాగ్రత్తలు తీసుకుని.. త‌నిఖీ చేయాలని ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు