Vitamin A : గర్భిణీల్లో విటమిన్ ఎ లోపిస్తే?

క్యారెట్‌, బీట్ రూట్‌, గుమ్మడి కాయ గింజలు, చిలగడ దుంపలు, చేపలు, గుడ్లు, మొక్క జొన్నలు, పెరుగు, పాలు, చీజ్‌, పాల కూర, బ్రొకోలీ, గ్రేప్ ఫ్రూట్స్‌, మిరప కాయలు, యాపిల్స్‌, అవకాడో, బొప్పాయి పండు, యాప్రికాట్స్, పిస్తా పప్పు తదితర ఆహారాల్లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది.

Vitamin A : గర్భధారణ సమయంలో గర్భంలో పిండం అభివృద్ధి మరియు అభివృద్ధికి తల్లికి అదనపు పోషకాలు అవసరమవుతాయి. మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలోనే అత్యధిక జాగ్రత్తలను తీసుకోవాలి. అలాగే శరీరానికి కొన్ని  పోషకాలను తప్పని సరిగా అందించాలి. అటువంటి వాటిల్లో విటమిన్ ఎ ఒకటి. మంచి కంటి చూపు, సమర్థవంతమైన సంతానోత్పత్తి మరియు ఆరోగ్యకరమైన చర్మానికి విటమిన్ ఎ అవసరం.విటమిన్ ఎ మగ మరియు ఆడ పునరుత్పత్తి వ్యవస్థలు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. విటమిన్ ఎ అధికంగా ఉన్న ఆహారం తినడం వల్ల మీ సంతానోత్పత్తి పెరుగుతుంది.

గర్భిణీ స్త్రీలు విటమిన్ ఎ విషయంలో నిర్లక్ష్యం చేస్తే అనేక అనర్థాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా గర్భిణీల్లో విటమిన్ ఎ లోపం వల్ల తల్లీ, బిడ్డలిద్దరూ చిన్న వయసులోనే కంటి సంబంధిత సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే కడుపులోని బిడ్డ ఎముకలు, దంతాలు, జుట్టు, మెదడు అభివృద్ధికి విటమిన్ ఎ లోపం అడ్డు కట్ట వేస్తుంది. అంతే కాదు, విటమిన్ ఎ లోపం తల్లీ, బిడ్డలిద్దరి రోగ నిరోధక వ్యవస్థలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మరియు గర్భిణీలో చర్మం పొడి బారడం, పెలుసుగా మారడం, దురద వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే గర్భిణీలు విటమిన్ ఎ లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. అందు కోసం కొన్ని కొన్ని ఆహారాలను తరచూ తీసుకోవాలి. మరి ఆ ఆహారాలు ఏంటో కూడా ఓ లుక్కేసేయండి.

క్యారెట్‌, బీట్ రూట్‌, గుమ్మడి కాయ గింజలు, చిలగడ దుంపలు, చేపలు, గుడ్లు, మొక్క జొన్నలు, పెరుగు, పాలు, చీజ్‌, పాల కూర, బ్రొకోలీ, గ్రేప్ ఫ్రూట్స్‌, మిరప కాయలు, యాపిల్స్‌, అవకాడో, బొప్పాయి పండు, యాప్రికాట్స్, పిస్తా పప్పు తదితర ఆహారాల్లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి, ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఈ ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే విటమిన్ ఎ పుష్పలంగా అందుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు