Rebirth Possible : ఫ్రీజర్‌లో పునర్జన్మ.. చావుని జయించాలని ఆస్ట్రేలియా ప్రయోగాలు..

Rebirth Possible : పుట్టినవానికి మరణం తప్పదు.. మరణించినవానికి పుట్టుక తప్పదు. అందుకే, తప్పించుకోవడానికి వీలులేని దాని విషయంలో నీవు దుఃఖించడం తగదు అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు.

Rebirth Possible : పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు… కానీ, మరణాన్ని అధిగమించాలనే ఆశ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. చివరి క్షణంలోనూ మరికొంత జీవితం కోసం పోరాడుతూనే ఉంటాం… ఎప్పుడో ఒకరోజు ఈ శరీరానికి అంతం తప్పదని తెలిసి ఆశపడుతుంటాం… ఐతే ఇప్పుడు జరుగుతున్న ప్రయోగం అసలు మరణమే లేకుండా… మరో జన్మంటూ ఉంటే ఈ దేహంతోనే కొత్త జీవితాన్ని ఆరంభించాలని అనుకోవడమే…. ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నను… అంతకు మించిన ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది..

Read Also : Kamineni Hospitals : దేశంలోనే ఫస్ట్ టైమ్.. పోలియో బాధితుడికి కామినేని ఆస్ప‌త్రిలో గుండెమార్పిడి విజయవంతం

పుట్టినవానికి మరణం తప్పదు.. మరణించినవానికి పుట్టుక తప్పదు. అందుకే, తప్పించుకోవడానికి వీలులేని దాని విషయంలో నీవు దుఃఖించడం తగదు అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. బహుశా ఇందుకేనేమో మనలో చాలా మంది పునర్జన్మ ఉంటుందని నమ్ముతుంటారు. ఒకరు చనిపోయినపుడు, ఆ శరీరంలో వివిధ రకాల శక్తులు నశిస్తాయని నిపుణులు చెబుతుంటారు. మొదట శరీరం చనిపోతుంది. తర్వాత ఇంద్రియాలు, తర్వాత శ్వాస నశిస్తాయి. అయితే అస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగం శరీరంతోపాటు సమస్త అవయువాలను పునరుద్ధరించే ప్రక్రియ చేపడుతున్నారు.

మరణించిన వ్యక్తిని ప్రత్యేక రకమైన స్లీపింగ్ బ్యాగ్‌లో చుట్టి డ్రై ఐస్‌లో ప్యాక్ చేయడం… అతని శరీర ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 80 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించి శరీర అవయవాలు పాడవకుండా చూడటం ప్రధానంగా చెబుతున్నారు. ఇక భగద్గీతలోనో… బౌద్ధ ధర్మంలోనో చెప్పినట్లు పునర్జన్మపై చాలా నమ్మాకాలే ఉన్నాయి. కానీ అవన్నీ అందమైన ఊహాలే..వాస్తవంలో ఏ ఒక్కరికీ పునర్జన్మ లభించినట్లు ఆధారాలు లేవు. పునర్జన్మ కోసం ప్రస్తుత శరీరం వాడుకోవడమూ జరగలేదు.

కానీ, ప్రస్తుత ప్రయోగం ఉంటుందో లేదో తెలియని పునర్జన్మ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరణాంతరం తమ శరీరాలను భద్రపర్చాలని అనుకోవడమే పెద్ద వింత. ఆస్ట్రేలియా కంపెనీ క్రయోనిక్స్‌ వద్ద పునర్జన్మ కోరుకుని తమ శరీరాలను భద్రపరచాలని చాలామంది ఒప్పందాలు చేసుకుంటున్నారు. నిజంగా  ఆస్ట్రేలియన్‌ శాస్త్రవేత్తల ప్రయోగం ఫలిస్తుందా? లేదో అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Read Also : Rebirth Possible : పునర్జన్మ కోసం కోట్ల రూపాయల ఖర్చు

ట్రెండింగ్ వార్తలు