Gabriel Hurricane : న్యూజిలాండ్ ను వణికిస్తోన్న గాబ్రియేల్ తుఫాన్.. 46 వేల ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

గాబ్రియేల్ తుఫాన్ న్యూజిలాండ్ ను వణికిస్తోంది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ ధాటికి న్యూజిలాండ్ అల్లకల్లోలం అవుతోంది. మూడు రోజులుగా అతి భారీ వర్షాలు ఆ ద్వీప దేశాన్ని ముంచెత్తున్నాయి.

Gabriel Hurricane : గాబ్రియేల్ తుఫాన్ న్యూజిలాండ్ ను వణికిస్తోంది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ ధాటికి న్యూజిలాండ్ అల్లకల్లోలం అవుతోంది. మూడు రోజులుగా అతి భారీ వర్షాలు ఆ ద్వీప దేశాన్ని ముంచెత్తున్నాయి. బలమైన ఈదురు గాలులకు న్యూజిలాండ్ చిగురుటాకులా వణికిపోతోంది. ఆక్లాండ్ సహా పలు నగరాలు తుఫాన్ భారీన పడ్డాయి. భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

న్యూజిలాండ్ ఉత్తర ప్రాంతాల్లో 250 కిలో మీటర్లు వేగంతో గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడి వాహనాలు ధ్వంసమయ్యాయి. 46 వేల ఇళ్లకు విద్యత్ సరఫరా నిలిచిపోయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాలు కూడా రద్దయ్యాయి. మొత్తం 509 విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

Amercia Bomb Cyclone : అమెరికా అల్లకల్లోలం.. అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న మంచు తుఫాన్, 34కి పెరిగిన మృతుల సంఖ్య

ఆక్లాండ్ ల్యాండ్ గాలి వేగం ప్రస్తుతం గంటకు 110 కిలో మీటర్లుగా ఉంది. అక్కడ గత 24 గంటల్లో 4 అంగుళాల వర్షం కురిసింది. దీంతో సముద్రం మట్టం వేగంగా పెరిగుతోంది. మట్కానా తీరంలో చాలా ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలుగా ఇళ్లు, గోదాముల బయట వరద నీటిని అడ్డుకునేందుకు ఇసుక బస్తాలు వేస్తున్నారు.

హరికేన్ గాబ్రియేల్ తీరం దాటడంతో న్యూజిలాండ్ వాతావరణ విభాగం అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఈ తుఫాన్ ప్రమాదమని ఆ దేశ ప్రధాని పేర్కొన్నారు. ప్రజల సహాయం కోసం రూ.60 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు