Imran Khan: యాత్ర ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్.. తొలి ప్రసంగంలోనే ఇండియాపై ప్రశంసలు

భారత విదేశాంగ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశాంగ నిర్ణయాలన్నీ ఆ దేశ ప్రభుత్వమే స్వతంత్రంగా తీసుకుంటుంది. రష్యా మీద ప్రపంచం ఎన్ని ఆంక్షలు విధించినా.. తక్కువ ధరలో ఆయిల్ వస్తే భారత్ కొనేసింది. ఆ విషయంలో అమెరికా సహా అనేక దేశాలు బెదిరింపులను, హెచ్చరికలను భారత్ పట్టించుకోలేదు. తమ దేశస్తుల ప్రయోజనం కోసం భారత్ కట్టుబడి పని చేస్తోంది. కానీ, పాకిస్తాన్ అలా కాదు

Imran Khan: పాకిస్తాన్‭లోని లాహోర్ నుంచి రాజధాని ఇస్లామాబాద్ వరకు మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. కాగా, యాత్ర ప్రారంభమైన తొలి ప్రసంగంలోనే ఇండియాపై ఇమ్రాన్ ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడటం గమనార్హం. వాస్తవానికి భారత విదేశాంగ విధానంపై ఇమ్రాన్ ఎప్పటి నుంచో ప్రశంసిస్తున్నారు. కాగా, తాజాగా యాత్ర సందర్భంగా మరోసారి ప్రశంసిస్తూ వ్యాఖ్యానించడం గమనార్హం.

‘‘భారత విదేశాంగ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశాంగ నిర్ణయాలన్నీ ఆ దేశ ప్రభుత్వమే స్వతంత్రంగా తీసుకుంటుంది. రష్యా మీద ప్రపంచం ఎన్ని ఆంక్షలు విధించినా.. తక్కువ ధరలో ఆయిల్ వస్తే భారత్ కొనేసింది. ఆ విషయంలో అమెరికా సహా అనేక దేశాలు బెదిరింపులను, హెచ్చరికలను భారత్ పట్టించుకోలేదు. తమ దేశస్తుల ప్రయోజనం కోసం భారత్ కట్టుబడి పని చేస్తోంది. కానీ, పాకిస్తాన్ అలా కాదు. బానిసత్వం చూపిస్తోంది. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అంటే, కొనడం ఆపేసింది. మన దేశ పౌరుల భద్రత, ప్రయోజనాల కంటే ఇతరుల బెదిరింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది’’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

380 కిలోమీటర్లు, వారం రోజుల కొనసాగనున్న ఈ యాత్ర నవంబర్ 4వ తేదీ నాటికి ఇస్లామాబాద్ చేరుకుంటుందని చెబుతున్నారు. దీనికి పార్టీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని, యాత్ర విజయవంతానికి వారంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికలను వీలైనంత ముందుగా జరిపేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చే విధంగా ఇమ్రాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజా యాత్ర చేపట్టారు.

Pakistan: చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం మిలిటరీ మద్దతు కోరిన ఇమ్రాన్ ఖాన్!

ట్రెండింగ్ వార్తలు