Narges Mohammadi: ఇరాన్‭లో మహిళా హక్కుల పోరాటం.. నర్గెస్ మొహమ్మదీకు నోబెల్ శాంతి బహుమతి

సుమారు 31 ఏళ్లపాటు జైలు జీవితాన్ని గడిపారు. అంతే కాకుండా 154 కొరడా దెబ్బలు కూడా తిన్నట్లు నోబెల్ ప్రైజ్ వెబ్‭సైట్లో పేర్కొన్నారు. ఈ అవార్డు గురించి శుక్రవారం నోబెల్ ప్రైజ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

Nobel Peace Prize: ఇరాన్‌లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులు, స్వేచ్ఛను పెంపొందించడం కోసం పోరాడినందుకు నెర్గెస్ మొహమ్మదీకి 2023 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయించింది. మానవ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో ఆమె 13సార్లు అరెస్ట్ అయ్యారు. సుమారు 31 ఏళ్లపాటు జైలు జీవితాన్ని గడిపారు. అంతే కాకుండా 154 కొరడా దెబ్బలు కూడా తిన్నట్లు నోబెల్ ప్రైజ్ వెబ్‭సైట్లో పేర్కొన్నారు. ఈ అవార్డు గురించి శుక్రవారం నోబెల్ ప్రైజ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

DHRC వైస్ ప్రెసిడెంట్ నర్గేస్ మొహమ్మది
డిఫెండర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ (DHRC)కు నర్గేస్ మొహమ్మది వైస్ ప్రెసిడెంట్. ఇస్లామిక్ దేశమైన ఇరాన్‌లో మరణశిక్షను రద్దు చేయాలని, ఖైదీల హక్కుల కోసం పోరాడాడు. ఈ క్రమంలో పలుమార్లు ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. భావప్రకటనా స్వేచ్ఛ, స్వేచ్ఛ కోసం ఆయన చేసిన ధైర్య పోరాటానికి వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇరాన్ లో ఇస్లామిక్ పాలన ఆమెను మొత్తం 13 సార్లు అరెస్టు చేసింది. ఐదుసార్లు దోషిగా నిర్ధారించింది. మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు విధించింది. నర్గీస్ మొహమ్మది ఇంకా జైల్లోనే ఉన్నారు.

1901 నుంచి ఇప్పటి వరకు 104 నోబెల్ శాంతి బహుమతులు ఇచ్చారు. వీటిలో 70 శాంతి బహుమతులు ఒక విజేతకు మాత్రమే ఇచ్చారు. చరిత్రలో ఇప్పటివరకు 19 మంది మహిళలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అలాగే 27 వివిధ సంస్థలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. నోబెల్ ప్రైజ్ చరిత్రలో అతి పిన్న వయస్కులో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నది మలాలా యూసఫ్ జాయ్. 2014లో ఆమెను శాంతి బహుమతితో సత్కరించారు. అప్పటికి మలాలా యూసఫ్ జాయ్ వయసు 17 ఏళ్లు మాత్రమే.

ఇవి కూడా చదవండి:

World Cup 2023 PAK vs NED : హైదరాబాద్ లో మ్యాచ్.. ఆరంభంలోనే పాకిస్థాన్ కు బిగ్ షాక్

Sikkim flash flood : సిక్కిం మెరుపు వరదల్లో 19కి పెరిగిన మృతుల సంఖ్య, 98 మంది గల్లంతు

ట్రెండింగ్ వార్తలు