Peru landslides: పెరూలో విరిగిపడిన కొండచరియలు.. 36 మంది మృతి

వర్షాల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండ దిగువన ఉన్న గ్రామాలకు భారీ నష్టం కలుగుతోంది. పెద్ద రాళ్లు, మట్టి వంటివి పడటంతో పలువురు మరణిస్తున్నారు. ఇండ్లు ధ్వంసమవుతున్నాయి. కొండ దిగువన ఉన్న రహదారులు స్తంభించిపోయాయి.

Peru landslides: దక్షిణ అమెరికాలోని పెరూలో భారీ విపత్తు సంభవించింది. కొండ చరియలు విరిగిపడటంతో 36 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. పెరూలో ఫిబ్రవరిలో వర్షాలు అతిగా కురుస్తాయి. దీంతో ఈసారి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పెరూ దక్షిణ ప్రాంతంలోని క్యామనా ప్రావిన్స్‌లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Delhi: కబడ్డీ క్రీడాకారిణిపై కోచ్ అత్యాచారం.. బాధితురాలి ఫిర్యాదు.. ఢిల్లీ కోర్టులో విచారణ

వర్షాల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండ దిగువన ఉన్న గ్రామాలకు భారీ నష్టం కలుగుతోంది. పెద్ద రాళ్లు, మట్టి వంటివి పడటంతో పలువురు మరణిస్తున్నారు. ఇండ్లు ధ్వంసమవుతున్నాయి. కొండ దిగువన ఉన్న రహదారులు స్తంభించిపోయాయి. బురద మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో కిలోమీటర్ల పొడవునా రవాణా నిలిచిపోయింది. సోమవారం ఒక రోడ్డుపై వ్యాన్‌లో ఐదుగురు వ్యక్తులు వెళ్తుండగా, కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ పై నుంచి పడ్డ మట్టి కొట్టుకొచ్చి, వాహనాన్ని దగ్గర్లోని నదిలోకి నెట్టేసింది. ఈ ఘటనలో వ్యాన్‌లోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడుతున్న ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

Kakani Govardhan Reddy: నెల్లూరు రూరల్‌లో ఎక్కువ మెజారిటీ సాధిస్తాం: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. పలువురు గల్లంతుకాగా, వారి కోసం వెతుకుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఇప్పటివరకు 650కిపైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. కొండ దిగువన ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీరు వంటివి అందిస్తున్నారు. కాగా, ఈ స్థాయిలో కొండచరియలు విరిగిపడటం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు