Coronavirus China: షాంఘైను వీడుతున్నరు.. పెరుగుతున్న కొవిడ్ కేసులతో ఇతర ప్రాంతాలకు ప్రజలు..

చైనాను కొవిడ్ అతలాకుతలం చేస్తుంది. రోజురోజుకు అక్కడ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలోని అతిపెద్ద నగరాలైన షాంఘై, బీజింగ్ లలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ...

Coronavirus China: చైనాను కొవిడ్ అతలాకుతలం చేస్తుంది. రోజురోజుకు అక్కడ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలోని అతిపెద్ద నగరాలైన షాంఘై, బీజింగ్ లలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రెండు నగరాలే కీలకం. ఈ రెండు నగరాల్లో రోజుకు 15వేల కొత్త కేసులు నమోదవుతుండటంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు నగరాల్లో లాక్‌డౌన్ విధించి కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది. ముఖ్యంగా షాంఘైలో పెరుగుతున్న కొవిడ్ కేసులతో అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు.

China : చైనాలో మరో వైరస్‌..ప్రపంచంలోనే మొదటి కేసు నమోదు..చికిత్స పొందుతున్న 4 ఏళ్ల బాలుడు

ప్రభుత్వం లాక్ డౌన్ విధించి, కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ ఏదోఒకలా షాంఘైను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌ట్ట‌ణాన్ని విడిచి వెళ్ల‌డానికి ప్ర‌జ‌లు ఒక‌రికొక‌రు ఉపాయాలు కూడా చెప్పుకుంటున్నారంటే ప‌రిస్థితి ఊహించుకోవ‌చ్చు. చైనా దేశంలో షాంఘై అత్యంత కీల‌క‌మైన సిటీ. ఎన్నో ఐటీ కంపెనీలు కూడా వున్నాయి. విదేశీయులు కూడా ఇక్కడ అధికంగానే ఉన్నారు. కోవిడ్ దృష్ట్యా ఈ సిటీని వీడడానికి మొగ్గు చూపుతున్నారు. ప్ర‌తి నెలా ప్యాక‌ర్స్ అండ్ మూవ‌ర్స్‌కు 30 నుంచి 40 ఆర్డ‌ర్లు వుండేవి. కానీ ప్ర‌స్తుత ద‌శ‌లో ఆర్డ‌ర్లు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరిగాయ‌ని నిర్వాహ‌కులు పేర్కొంటున్నారు. కొవిడ్ కేసుల పెరుగుదలతో పాటు ప్ర‌జ‌ల‌కు తిన‌డానికి తిండి కూడా దొర‌క‌డం గ‌గ‌నంగా మారుతుంది.

China Coronavirus: వణుకుతున్న చైనా.. ఒకేరోజు 56మంది మృతి..

కేసుల కార‌ణంగా ఇరుగు పొరుగు వాళ్లు కూడా స‌హాయం చేయ‌డానికి ఏమాత్రం ముందుకు రావ‌డం లేదు. కేసుల కార‌ణంగా దాదాపుగా అంద‌రూ ఐసోలేష‌న్‌లోనే వుండిపోతున్నారు. విదేశీయుల‌కైతే తిండి దొర‌క‌డం గ‌గ‌న‌మైంది. కోవిడ్ ఇంత‌గా విజృంభిస్తున్నప్పటికీ ప్ర‌భుత్వం ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విదేశీయులు చైనా ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక‌.. షాంఘైను విడిచిపెట్ట‌డ‌మే అత్యుత్త‌మ‌మ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చామ‌ని వాళ్లు స్ప‌ష్టం చేస్తున్నారు. ఇక అక్కడ క్యాబ్ రేట్లు కూడా విచ్చ‌ల‌విడిగా పెరిగిపోయాయి. నిజానికి విమానాశ్ర‌యం వెళ్ల‌డానికి 30డాల‌ర్లు ఖ‌ర్చైతే, క్యాబ్ డ్రైవ‌ర్లు 500 డాల‌ర్లు తీసుకుంటున్నార‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు