IPL 2024 : ఈసారి కూడా పాయె..! ఆర్సీబీ ఓటమిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్.. వీడియోలు వైరల్

ఆర్సీబీ ఓటమి తరువాత.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ తో నెటిజన్లు సందడి చేస్తున్నారు. చాలా హ్యాష్ ట్యాగ్ లు నిరంతరం ట్రెండింగ్ లో ఉన్నాయి.

Royal Challengers Bengaluru : ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు (RCB) ప్రయాణం ముగిసింది. బుధవారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుపై ఫాఫ్ డూప్లిసెస్ సేన ఓటమి పాలైంది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈసారి ట్రోపీ ఆర్సీబీ జట్టుదేనంటూ ధీమాతో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, రాజస్థాన్ జట్టుపై ఓటమితో ఆర్సీబీ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయినంత పనైంది. వరుసగా 17వ సారికూడా ఐపీఎల్ ట్రోపీ దక్కించుకోలేక పోవటంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడారు.

Also Read : IPL 2024 : కోహ్లీతోనే ఆటలా.. ఫలితం అలాగే ఉంటది మరి! వీడియో వైరల్

ఐపీఎల్ ప్రారంభం ఏడాది నుంచి తమ అభిమాను జట్టు ట్రోపీ గెలుస్తుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటున్నప్పటికీ.. ఆర్సీబీ జట్టు నిరాశనే మిగుల్చుతుంది. ప్రతీఏడాది ఇదే తంతు కొనసాగుతూ వస్తుంది. ఈ సీజన్ లో కచ్చితంగా ట్రోపీ గెలుస్తామని ఆర్సీబీ జట్టు ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. అయితే, 2024 ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ వరుస ఓటములు చవిచూస్తూ వచ్చింది. కానీ, లీగ్ దశలో చివరి మ్యాచ్ లలో వరుస విజయాలతో ప్లేఆప్స్ లోకి ఆ జట్టు అడుగు పెట్టింది. లీగ్ దశలో చివరి మ్యాచ్ లో చెన్నైపై ఆర్సీబీ అద్భుత విజయాన్ని నమోదు చేయడంతో ఈసారి కప్ మనదేనని ఫ్యాన్స్ మరింత ధీమాతో ఉన్నారు. కానీ, ఎలిమినేటర్ మ్యాచ్ లో ఫ్యాన్స్ ఆశలన్నీ ఆర్సీబీ ప్లేయర్లు అడియాశలు చేశారు.

Also Read : Dinesh Karthik : ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్..! కోహ్లీ ఏం చేశాడంటే..? వీడియో వైరల్

ఆర్సీబీ ఓటమి తరువాత.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ తో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆర్సీబీ ఓటమి తరువాత చాలా హ్యాష్ ట్యాగ్ లు నిరంతరం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇదిలాఉంటే.. ఆర్సీబీపై విజయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈనెల 24న జరిగే క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. ఆ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది.

 

ట్రెండింగ్ వార్తలు