IPL 2024 : ఆర్సీబీ ఓటమితో ఆనందంలో సీఎస్కే, ముంబై ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో సెటైర్లు..

ఐపీఎల్ 2024 నుంచి ఆర్సీబీ జట్టు నిష్క్రమణతో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ ఓటమిపై సెటైర్లు వేస్తున్నారు

IPL 2024 RCB vs CKS and MI Fans : ఐపీఎల్ 2024లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ట్రోపీని గెలుచుకోవటంలో విఫమైంది. ట్రోపీకి రెండు అడుగుల దూరంలో ఆర్సీబీ ఐపీఎల్ 2024 నుంచి ఔట్ అయింది. బుధవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై బెంగళూరు జట్టు ఓటమి పాలైంది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశతో ఉన్నారు. ఐపీఎల్ మొదలైన నాటినుంచి నేటివరకు ఆర్సీబీ ట్రోపీని గెలుచుకోలేక పోయింది. ప్రతీయేడాది ఈఏడాది మాదే ట్రోపీ అని ఆర్సీబీ ఫ్యాన్స్ ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ వారికి నిరాశే ఎదురవుతోంది. తాజాగా ఐపీఎల్ 2024లోనూ ఆర్సీబీ ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు.

Also Read : IPL 2024 : కోహ్లీతోనే ఆటలా.. ఫలితం అలాగే ఉంటది మరి! వీడియో వైరల్

ఐపీఎల్ 2024 నుంచి ఆర్సీబీ జట్టు నిష్క్రమణతో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ ఓటమిపై సెటైర్లు వేస్తున్నారు. చెన్నై, ముంబై జట్ల ఫ్యాన్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ ను టార్గెట్ గా చేసుకొని సోషల్ మీడియాలో మీమ్స్ తో సందడి చేస్తున్నారు. చెన్నై, ముంబై జట్లు ఐదు సార్లు ఐపీఎల్ ట్రోపీలను గెలిచుకున్నాయి.. మరి మీ అభిమాన జట్టు ఎన్నిసార్లు ట్రోపీలను గెలిచిందంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ను ముంబై, చెన్నై ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : IPL 2024 : ఈసారి కూడా పాయె..! ఆర్సీబీ ఓటమిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్.. వీడియోలు వైరల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించి ప్లేఆఫ్స్ కు చేరింది. ఆ సమయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగహడావుడి చేశారు. ఈ క్రమంలో ఇరు జట్ల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి వార్ జరిగింది. ఈ క్రమంలో బెంగళూరు ఫ్యాన్స్ ధోనీని టార్గెట్ చేయగా.. చెన్నై ఫ్యాన్స్ కోహ్లీని టార్గెట్ గా సోషల్ మీడియాలో విమర్శలు చేసుకున్నారు. తాజాగా ఎలిమినేట్ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలుకావడంతో సీఎస్కే ఫ్యాన్స్ కుతోడు ముంబై ఫ్యాన్స్ సైతం ఆర్సీబీ ఓటమిపై సోషల్ మీడియాలో సెటైర్లతో కూడిన వీడియోలను పోస్టు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు