Ilaiyaraaja : ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా టీంకు కూడా లీగల్ నోటీసులు పంపిన ఇళయరాజా.. ఇంకెంతమందికి పంపుతారో..

ఇళయరాజా ఇటీవల కాలంలో ఎక్కడ తన పాట ఏ రకంగా వాడినా వాళ్లకు లీగల్ నోటీసులు పంపుతున్నారు.

Ilaiyaraaja : సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఒక రాజు లాంటి వారు. ముఖ్యంగా 80, 90 దశకాల్లో తెలుగు, తమిళ్ సినిమాలకు ఎన్నో గొప్ప పాటలు, ఎంతో గొప్ప సంగీతం ఇచ్చారు. ఇప్పటికి చాలామంది ఇళయరాజా పాటలే వింటూ ఉంటారు. పాటల విషయంలో, సంగీత దర్శకత్వం విషయంలో ఆయన్ని అభినందించని వారు ఉండరు. కానీ ఇటీవల ఓ విషయంలో అందరూ ఆయన్ని విమర్శిస్తున్నారు. ఇళయరాజా ఇటీవల కాలంలో ఎక్కడ తన పాట ఏ రకంగా వాడినా వాళ్లకు లీగల్ నోటీసులు పంపుతున్నారు.

గతంలో ఏకంగా SP బాలు గారికే అమెరికా ఈవెంట్స్ లో తన పాటలు తన పర్మిషన్ లేకుండా వాడాడు అని లీగల్ నోటీసులు పంపి బాలు చాలా బాధకు గురయ్యేలా చేశారు. ఇద్దరు ఎప్పట్నుంచో మంచి స్నేహితులు అలాంటిది ఆయనకే నోటీసులు పంపించారు. ఇక ఆ తర్వాత ఏదైనా సినిమాల్లో కూడా, వేరే చోట్ల కానీ తన పాటలని, సంగీతాన్ని ఎవరైనా వాడితే వాళ్లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. తన పర్మిషన్ తీసుకోలేదని, తనకు డబ్బులు చెల్లించాలని, తనకి క్రెడిట్స్ ఇవ్వాలని లేకపోతే చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులు పంపుతున్నారు ఇళయరాజా.

Also Read : Prabhas Vehicle in Kalki Bujji : ‘కల్కి’ సినిమాలో ప్రభాస్ నడిపే వెహికల్ ‘బుజ్జి’ ఇదే.. అదిరిపోయిందిగా..

ఈ విషయంలో ఇళయరాజా విమర్శల పాలవుతున్నారు. ఇప్పటికే తన పాటలను వాడిన పలు సినిమాలకు నోటీసులు పంపగా తాజగా మలయాళం సూపర్ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్ కి నోటీసులు పంపించారు. మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో కమల్ హాసన్ గుణ సినిమాలోని కమ్మని ఈ ప్రేమ లేఖనే.. పాటని వాడారు. మలయాళ, తమిళ్, తెలుగు.. అన్ని వెర్షన్స్ లోను ఈ పాటనే వాడారు. ఈ పాటకి సంగీతం ఇచ్చింది ఇళయరాజానే.

అసలు ఆ పాట వల్లే మంజుమ్మల్ బాయ్స్ సినిమా హిట్ అయిందని కూడా చెప్పొచ్చు. తాజాగా మంజుమ్మల్ బాయ్స్ మూవీ టీమ్ కు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు. తన పర్మిషన్ లేకుండా తన పాట వాడుకున్నారని, తనకు నష్టపరిహారం 15 రోజుల్లోగా చెల్లించాలని లేకపోతే లీగల్ గా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని నోటీసులు పంపించాడు. దీంతో మూవీ టీమ్ షాక్ అవ్వగా ఈ విషయం తెలిసి ఇంకెంతమందికి నోటీసులు పంపుతాడో ఇళయరాజా అని విమర్శలు చేస్తున్నారు. అయితే ఆల్రెడీ మంజుమ్మల్ బాయ్స్ గుణ సినిమా సాంగ్స్ రైట్స్ ని మ్యూజిక్ కంపెనీ నుంచి కొనుక్కున్నారు. సినిమా మొదట్లో స్పెషల్ థ్యాంక్స్ అని ఇళయరాజాకు, కమల్ హాసన్ కు క్రెడిట్స్ కూడా ఇచ్చారు. అయినా ఇలా ఇళయరాజా నోటీసులు పంపించడం గమనార్హం. తన పాటలను అందరూ గొప్పగా చెప్పుకుంటూ పాడుకుంటుంటే సంతోషించాల్సిందిపోయి లీగల్ నోటీసులు పంపి డబ్బులు అడగడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు