Shah Rukh Khan : కంగారుపడాల్సిన పనిలేదు.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన షారుఖ్ ఖాన్..

తాజాగా నేడు ఉదయం షారుఖ్ అహ్మదాబాద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

Shah Rukh Khan : ఇటీవల జరిగిన SRH వర్సెస్ KKR క్వాలిఫైర్ మ్యాచ్ కు బాలీవుడ్ బాద్‌షా, KKR జట్టు యజమాని షారుఖ్ ఖాన్ అహ్మదాబాద్ కి వచ్చాడు. అయితే ఆ రోజు, తర్వాత రోజు అహ్మదాబాద్ లో ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో షారుఖ్ వడదెబ్బకు గురయ్యాడు. దీంతో షారుఖ్ అహ్మదాబాద్ లోని KD హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. నిన్న షారుఖ్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు అనగానే అభిమానులు కంగారు పడ్డారు. అయితే కేవలం వడదెబ్బ వల్లే చేరాడని సమాచారం.

Also Read : Kalki Bujji Launch Event : ‘కల్కి’ సినిమా ప్రభాస్ వెహికల్ ‘బుజ్జి’ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..

తాజాగా నేడు ఉదయం షారుఖ్ అహ్మదాబాద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నిన్న వడదెబ్బ నుంచి కోలుకోడానికి చికిత్స తీసుకున్న షారుఖ్ కోలుకోవడంతో నేడు ఉదయం డిశ్చార్జ్ అయి ముంబైకి బయలుదేరినట్టు సమాచారం. ఇక షారుఖ్ ని కలవడానికి ఆ మ్యాచ్ కి వచ్చిన షారుఖ్ ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాస్పిటల్ కి వెళ్లారు. అలాగే షారుఖ్ హాస్పిటల్ లో చేరాడని తెలియడంతో పలువురు అభిమానులు ఆ హాస్పిటల్ బయట గుమిగూడారు.

ట్రెండింగ్ వార్తలు