Russia vs ukraine war: యుక్రెయిన్‌లో రష్యా సైన్యం దాడులు ఎందుకు.. ఎప్పటి వరకు చేస్తుందో స్పష్టం చేసిన పుతిన్

యుక్రెయిన్‌లో రష్యా సైన్యం ఎందుకు దాడులు నిర్వహిస్తుందో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల విధానాలకు ప్రతిచర్యగానే యుక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్య...

Russia vs ukraine war: యుక్రెయిన్‌లో రష్యా సైన్యం ఎందుకు దాడులు నిర్వహిస్తుందో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల విధానాలకు ప్రతిచర్యగానే యుక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్య చేపట్టామని వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ఏటా మే 9న విక్టరీ డే పేరుతో భారీగా ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా మాస్కోలని రెడ్ స్క్వేర్‌ వద్ద పరేడ్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా పుతిన్ ప్రసంగించారు. నియో నాజీలతో పొంచిఉన్న ముప్పు నుంచి మాతృభూమిని రక్షించుకోవటం కోసమే యుక్రెయిన్‌లో రష్యా సేనలు పోరాడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం యుక్రెయిన్‌లో రష్యా దాడులను రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్ పోరాటంతో పుతిన్ పోల్చారు.

Russia vs ukraine war: పుతిన్ భయంకరమైన తప్పు చేస్తున్నాడు.. గుణపాఠం తప్పదు..

ఈ యుద్ధం సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రష్యన్ సైనికులకు పుతిన్ నివాళులర్పించారు. 2022 ఫిబ్రవరి 24 నుంచి యుక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులను కొనసాగిస్తోంది. ప్రారంభంలో సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టిన సైన్యం, ఆ తరువాత జనావాసాలుండే ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా దాడుల్లో యుక్రెయిన్ సైనికులతో పాటు, వందలాది మంది యుక్రెయిన్ పౌరులు మృత్యువాత పడ్డారు. మరోవైపు రష్యా సైనికులు సైతం వందలాది మంది మరణించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరును నిరసిస్తూ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్, కెనడా వంటి దేశాలతో పాటు దాదాపు ప్రపంచ దేశాలన్ని మండిపడుతున్నాయి. యుక్రెయిన్ పై దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేయడంతో పాటు రష్యాతో వాణిజ్య సంబంధాలను, ఇతర లావాదేవీలను విరమించుకుంటూ రష్యాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

Russia vs ukraine war: పుతిన్.. మరీ ఇంత క్రూరత్వమా.. రష్యాను వ్యతిరేకించే దేశాలకు మరో షాకిచ్చిన పుతిన్..

అయినా పుతిన్ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా యుక్రెయిన్‌లో దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఈ విక్టరీ డే పరేడ్‌లో పుతిన్ యుక్రెయిన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ దేశంలో కొనసాగిస్తున్న ప్రత్యేక మిలిటరీ చర్యను ఇకపై పూర్తిస్థాయి యుద్ధంగా పుతిన్ ప్రకటిస్తారని పలు దేశాలు భావించాయి. అయితే పుతిన్ అలాంటి ప్రకటనేమీ చేయకపోవటంతో యుక్రెయిన్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు