Rishi Sunak : చిన్నపాటి దూరానికే హెలికాప్టరా? ప్రజాధనాన్ని వేస్టుచేస్తున్నారని రిషి సునాక్‌పై విమర్శలు

రైలులో ప్రయాణించే అవకాశం ఉన్నా దానికి కూడా హెలికాప్టరా? రైలులో ప్రయాణిస్తే గంటలో చేరుకోవచ్చుగా..దానికి హెలికాప్టర్‌ ఎందుకంటూ విమర్శలు.

Rishi Sunak : బ్రిటన్ ప్రధాని (UK PM) రిషి సునాక్ (Rishi Sunak)ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చీటికీ మాటికి హెలికాప్టర్ (Helicopter) లో ప్రయాణిస్తు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 30 పౌండ్లు (సుమారు రూ. 3000) ఖర్చుతో పూర్తి అయ్యే ప్రయాణానికి కూడా హెలికాప్టర్ (Helicopter)లో ప్రయాణించి 6,000 పౌండ్లు పెట్టారని..సమయాన్ని కూడా వృథా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

దీనికి కారణం రిషి సునాక్ గంట సమయంలో చేరుకునే ప్రయాణానికి కూడా హెలికాప్టర్ వినియోగంటంపై విమర్శలు వస్తున్నాయి. రైలులో ప్రయాణించే అవకాశం ఉన్నా దానికి కూడా హెలికాప్టరా? అంటూ విమర్శిస్తున్నారు. రైలులో ప్రయాణిస్తే కేవలం గంటలో చేరుకునే ప్రయాణానికి రిషి సునాక్‌ హెలికాప్టర్‌ ఉపయోగించడంపై విమర్శలు వస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణంగా ఇటీవల రిషి సునాక్ ప్రయాణమే కారణంగా కనిపిస్తోంది. రిషి సునాక్ సౌతాంప్టన్‌ ( Southampton)లోని ఫార్మసీ(pharmacy)ని సందర్శించేందుకు మంగళవారం (మే,2023)ప్రైవేటు హెలికాప్టర్‌లో ప్రయాణించారు. దీనికి ప్రధాని అధికారిక నివాసం వివరణ ఇచ్చింది. ఈ ప్రయాణానికి ప్రజా ధనాన్ని ఖర్చు చేసినట్లు ప్రధాని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్‌ (Downing Street)స్వయంగా వెల్లడించింది. దీనికి ప్రధాని బిజీ షెడ్యూల్‌ కారణంగా ప్రధాని హెలికాప్టర్‌లో ప్రయాణించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.

ప్రధాని సాతాంప్టన్‌కు వాటర్‌లూ స్టేషన్‌ నుంచి రైలులో ప్రయాణిస్తే 30 పౌండ్లు (సుమారు రూ. 3000) ఖర్చవుతుంది. కానీ.. ఆయన హెలికాప్టర్‌లో ప్రయాణించారు. ఈ ప్రయాణానికి 6,000 పౌండ్లు ( సుమారు రూ. 6 లక్షలకు పైగా) ఖర్చు చేసి ఉండవచ్చని ది గార్డియన్ వంటి పత్రికలు పేర్కొన్నాయి. దీంతో ప్రజా ధనాన్ని ప్రధాని వృథా చేస్తున్నారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రధాని ప్రతినిధి స్పందిస్తు..ప్రధాని అధికారిక పనులపై ఎప్పుడు బిజీ బిజీగా ఉంటారు. కాబట్టి సమయాన్ని బట్టి ప్రధాని రవాణా ప్రణాళికలు మారుతాయి. కాబట్టి కొన్నిసార్లు త్వరగా ప్రదేశాలకు చేరుకోవడం, తిరిగి రావడం వల్ల ఆయన సమయం వృథా కాకుండా ఉంటుందని అందువల్ల హెలికాప్టర్‌లో ప్రయాణించడం తప్పు కాదు అంటూ వివరించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు